AI Surveillance: ఇన్‌స్టాలో మైనర్ల ఖాతాలపై ఏఐతో నిఘా
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:23 AM
ఇన్‌స్టాగ్రామ్ మైనర్ల ఖాతాలను గుర్తించడానికి కృత్రిమ మేధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. వయసును తప్పుగా చూపి అకౌంట్లు క్రియేట్ చేసిన మైనర్లపై ఎక్కువ ఆంక్షలు విధించాలని సంస్థ పేర్కొంది

వాషింగ్టన్, ఏప్రిల్ 21: తప్పుడు వయసు చూపి ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న మైనర్ల ఖాతాలను కృత్రిమ మేధను ఉపయోగించి గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తెలిపింది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో కొందరు మైనర్లు తమ వయసును ఎక్కువగా చూపుతున్నారని ఇన్‌స్టాగ్రామ్ అనుమానిస్తోంది. అలాంటి అకౌంట్లను గుర్తించడానికి క్రియాశీలకంగా వ్యవహరించాలని ఇన్‌స్టాగ్రామ్ నిర్ణయించింది. అటువంటి అకౌంట్లను గనక తాము గుర్తిస్తే, వాటిని మరిన్ని ఆంక్షలు కలిగిన మైనర్ అకౌంట్లుగా మారుస్తామని తెలిపింది. అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేశారు, అకౌంట్ ప్రొఫైల్, దానికి సంబంధించిన కంటెంట్ ఆధారంగా యూజర్ల వయసును నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నామని సంస్థ తెలిపింది.