Share News

Indian Student fatally in UK: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్య.!

ABN , Publish Date - Dec 01 , 2025 | 08:01 AM

బ్రిటన్‌లో ఇండియాకు చెందిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు చేసిన మూకుమ్మడి దాడిలో అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది.

Indian Student fatally in UK: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్య.!
Indian Student Vijay Kumar

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌(Britain)లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. హరియాణా(Haryana)కు చెందిన విజయ్ కుమార్ షియోరాన్(Vijay Kumar Sheoran) అనే 30 ఏళ్ల విద్యార్థి యూకేలో విద్యనభ్యసిస్తున్నాడు. నవంబర్ 25న కొందరు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో విజయ్‌ ఒంటిపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు(Indian student stabbed to death in UK).


హరియాణాలోని చార్కీ దాద్రి జిల్లా(Charkhi Dadri district) జాగ్రంబస్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్.. భారత్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(Central Board of Excise and Customs) విభాగంలో పనిచేశాడు. ఉన్నత చదువుల కోసం యూకే(UK) వెళ్లాడు. అక్కడి ఓర్సెస్టర్‌(Worcester)లోని బార్బోర్న్ సమీపంలో ఇటీవల అతడిపై దాడి జరిగింది. ఈ ఘటనను హత్యగా భావించిన బ్రిటన్ పోలీసులు(Britain Police).. ఐదుగురు అనుమానిత నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. ఈ దాడికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై బ్రిటన్ అధికారులు ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.


తమ కుమారుడు మృతిచెందాడనే విషయం తెలుసుకున్నతల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విజయ్ కుమార్ మృతిపట్ల చార్కి దాద్రి ఎమ్మెల్యే సత్పాల్ సంగ్వాన్(MLA Satpal Sangwan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపిన ఆయన.. మృతదేహాన్ని త్వరలోనే భారత్‌కు రప్పించే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.


ఇవీ చదవండి:

ఆ ప్రధానికి కొత్త 'జోడీ'.. మోదీ అభినందనలు.!

తుఫాను ప్రభావం.. శ్రీలంకలో 212మంది మృతి

Updated Date - Dec 01 , 2025 | 12:26 PM