భారత్ కెనడా మళ్లీ భాయీభాయీ
ABN , Publish Date - Jun 19 , 2025 | 02:54 AM
జి-7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని కార్నీతో మోదీ కీలక చర్చలు జరిపారు

జి-7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని కార్నీతో మోదీ కీలక చర్చలు జరిపారు. గత ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరి కారణంగా.. ఉభయదేశాల నడుమ దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయించారు. ప్రధానంగా కాన్సులర్, వాణిజ్య సేవలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు రెండు దేశాల రాయబార కార్యాలయాల్లో కొత్త హైకమిషనర్లను నియమించాలని నిశ్చయించారు. కొత్త హైకమిషనర్లను త్వరలోనే రెండు దేశాలు ప్రకటిస్తాయని కెనడా ప్రధాని కార్యాలయం ఆ తర్వాత ఓ ప్రకటనలో తెలిపింది. పౌరులు, పారిశ్రామికవేత్తలు ఉభయదేశాల్లో తమ నిత్య కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు ఇద్దరు ప్రధానులూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కెనడాలో సిక్కు వేర్పాటువాద నేత హర్‌దీ్‌పసింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని అప్పటి ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల నడుమ సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. ఆయన తన ఆరోపణలు కొనసాగించడంతో గత ఏడాది అక్టోబరులో ఢిల్లీలోని కెనడా యాక్టింగ్ హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను బహిష్కరించింది