Share News

China Weaponizes Everything: చైనా చేతిలో ప్రతీదీ ఆయుధమేనా?

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:17 PM

పైనాపిల్స్ నుండి చిప్స్ వరకు. అరుదైన భూ ఖనిజాల నుంచి ఆస్ట్రేలియన్ వైన్ వరకు. చైనా ప్రతిదానినీ ఆయుధంగా మారుస్తుంది. తైవానీస్ పైనాపిల్స్‌ను నిరోధించడం, ఆస్ట్రేలియన్ వైన్‌పై సుంకాలు విధించడం, ఇంకా..

China Weaponizes Everything: చైనా చేతిలో ప్రతీదీ ఆయుధమేనా?
China weaponizes everything

ఇంటర్నెట్ డెస్క్: చైనా. ప్రపంచాన్నే శాసించగల స్థానంలోకి వెళ్లాలని తపిస్తోన్న దేశం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ ట్రేడ్ టారిఫ్స్ అంటూ ప్రంపంచ దేశాల్ని భయపెట్టినా ఎదురొడ్డి నిలిచిన దేశం. సై.. అంటే సై అంటూ ఎదురు సుంఖాలు విధించినా కాని, చివరికి అమెరికాను కాళ్లబేరానికి రప్పించుకున్న దేశం. ఇతర దేశాలతో వర్తక, వాణిజ్యాలు సైతం వ్యూహాత్మకంగా నెరిపే చైనా, ఎప్పుడూ కొత్త తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది.

పైనాపిల్స్ నుండి చిప్స్ వరకు. అరుదైన భూ ఖనిజాల నుంచి ఆస్ట్రేలియన్ వైన్ వరకు. చైనా ప్రతిదానినీ ఆయుధంగా మారుస్తుంది. తైవానీస్ పైనాపిల్స్‌ను నిరోధించడం, ఆస్ట్రేలియన్ వైన్‌పై సుంకాలు విధించడం, ఇంకా.. పశ్చిమ దేశాలకు చిప్ ఎగుమతులను పరిమితం చేయడం వరకు, చైనా చాలా కాలంగా వాణిజ్యాన్ని భౌగోళిక రాజకీయ ఒత్తిడి సాధనంగానూ చేసుకుంది. ఇప్పుడు, ఆ దేశం మరింత వ్యూహాత్మక, శక్తివంతమైన అరుదైన భూ ఖనిజాలు, మూలకాల వైపు మొగ్గు చూపుతోందని ఒక నివేదిక చెబుతోంది.

చైనా అరుదైన భూ ఖనిజాలను, వాటి నుండి తయారైన ప్రత్యేక అయస్కాంతాలను ఎగుమతి చేయడంపై కొత్త ఆంక్షలను విధించిన వెంటనే.. ప్రపంచ ఆటో పరిశ్రమల మూసివేతలకు దారితీసే సంభావ్య కొరత గురించి సదరు నివేదిక హెచ్చరించింది.

చైనా ఈ అరుదైన ఆంక్షలను వ్యూహాత్మకంగా విధించడం, సుంకాల పెంపు విషయంలో అమెరికాను దారికి తెచ్చుకోవడానికి వెనుక ఉన్న నిర్ణయాత్మక అంశం ఇదేనని కూడా సదరు నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ నుండి, చైనా అరుదైన భూ ఖనిజాలు, అయస్కాంతాల ఎగుమతులు USకు మాత్రమే కాకుండా జపాన్, దక్షిణ కొరియా వంటి కీలక భాగస్వాములకు కూడా తగ్గించడం విశేషం.

ఇది.. చైనా ఆర్థిక వ్యూహంలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని, చిన్న, పొరుగువారిపై మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలపై కూడా ఒత్తిడిని కలిగించగల ఆంక్షల విధానాన్ని చైనా ప్రదర్శిస్తోందని సదరు నివేదిక తెలిపింది. అయితే, ఇందులో మరో కోణం కూడా లేకపోలేదు. చైనా చేస్తున్న కుతంత్రాల్లో ఇదే మొదలు కాదు. గతం నుంచీ చైనా ఇలాంటి విషయాల్లో ప్రపంచ దేశాలపై తన గిమ్మిక్కులు చేస్తున్నా, ఆయా దేశాలు వీటిని తిప్పకొట్టి, లేదా కొట్టి పారేసి ముందుకు సాగాయి. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయి. గత కొన్నేళ్లుగా చైనా తరచు ఆర్థిక ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ, ఈ చర్యలు పాక్షికంగా మాత్రమే ఆయా దేశాలపై ప్రభావం చూపగలిగాయి.


ఉదాహరణకు, చైనా పర్యాటకులు ఫిలిప్పీన్స్‌ను సందర్శించడంలో ఆసక్తిని కోల్పోయారని, తైవానీస్ పైనాపిల్స్ ఆరోగ్య తనిఖీలలో విఫలమయ్యాయని లేదా చైనీస్ వినియోగదారులు కొరియన్ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నారనే వాదనల వల్ల ఆయా దేశాలు పెద్దగా ఇబ్బందిపడింది లేదు. చైనాకు ఒరిగిందేమీ లేదు.

ప్రభుత్వ మద్దతుగల బహిష్కరణలు చైనా వాణిజ్య భాగస్వాములపై ​కొంతమేర ​ఆర్థిక ఇబ్బందులు కలిగించి ఉండొచ్చు.. కానీ చైనా దేశానికి మిశ్రమ రాజకీయ ఫలితాలను అందించాయని ఆ నివేదిక అంటోంది. దలైలామాకు ఆతిథ్యం ఇవ్వకుండా, లేదా దక్షిణ చైనా సముద్ర వాదనలను వ్యతిరేకించకుండా కొన్ని దేశాలను చైనా నిరోధించగలిగినప్పటికీ, ఆ దేశానికి ప్రధాన జాతీయ ప్రయోజనాలేవీ ఒనగూడలేదని సదరు నివేదిక చెప్పుకొచ్చింది.

ఇక, విధానపరమైన వివాదాలలో భాగంగా చైనా, వైన్ దిగుమతి కోతలు విధించినప్పటికీ ఆస్ట్రేలియా స్థిరంగా నిలిచింది. చైనా ఆంక్షలు విధించినప్పటికీ దక్షిణ కొరియా తన క్షిపణి రక్షణ వ్యవస్థను కొనసాగించింది. అమెరికాపై చైనా గతంలో విధించిన ఆంక్షలు - రక్షణ కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, కొన్ని ఖనిజ ఎగుమతులపై లైసెన్సింగ్ విధానాలను విధించడం వంటివి చేసినప్పటికీ.. వీటి వల్ల చైనాకు ఆర్థిక ప్రాముఖ్యత లభించింది లేదు.

ఇక, భారత వాహన తయారీదారులు రా మెటీరియల్ కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అయితే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ జూన్ G7 సమావేశంలో అరుదైన భూ అయస్కాంతాలను హైలైట్ చేసి చైనాయేతర ఉత్పత్తిని పెంచాలని కోరారు. EU ఇప్పుడు చైనాతో తన దౌత్య చర్చలలో అరుదైన భూ ఖనిజాల ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.


ఈ వార్తలు చదవండి:

అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..

యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Read Latest and NRI News

Updated Date - Jul 08 , 2025 | 10:20 PM