Russian Soldiers Poisoned Water: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు రష్యా సైనికుల మృతి
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:59 AM
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలోని పాంటేలిమోనివ్కాలో విషం కలిపిన బాటిళ్లలోని నీళ్లు తాగి..

మరికొందరి పరిస్థితి విషమం
ఘటన వెనుక ఉక్రెయిన్ హస్తం
న్యూఢిల్లీ, జూలై 18: తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలోని పాంటేలిమోనివ్కాలో విషం కలిపిన బాటిళ్లలోని నీళ్లు తాగి.. ఆ దేశంతో యుద్ధంలో ఉన్న రష్యాకు చెందిన సైనికుల్లో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా టెలిగ్రాం మిలటరీ చానళ్లలో ప్రసారమవుతున్న దృశ్యాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. సైనికుల్లో కొందరు మూర్చపోయినట్లు, ఇంకొందరు ఊపిరి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘మా నీరు’ (అవర్ వాటర్) అనే లేబుల్‌తో ఉన్న ఈ నీళ్ల బాటిళ్లను రష్యా అధీనంలోని క్రిమియా నుంచి మానవతా దృక్పథంతో సరఫరా చేసే ఆహారపదార్థాల్లో భాగంగా అక్కడ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నీళ్లు తాగినవారిలో కొందరు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా సైన్యం ఆరోపించింది. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆధారాలను సైన్యం బయటపెట్టలేదు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి