Natural Disaster: టెక్సాస్‌లో వరదలు..
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:23 AM
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విలయం 51 మందిని పొట్టనబెట్టుకోగా.. 27 మంది బాలికలు గల్లంతయ్యారు.

27 మంది బాలికలు గల్లంతు
కేర్ కౌంటీలోనే 43 మరణాలు
51 మంది మృతి.. మృతుల్లో 15 మంది చిన్నారులు
వాషింగ్టన్/ముంబై, జూలై 6: అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విలయం 51 మందిని పొట్టనబెట్టుకోగా.. 27 మంది బాలికలు గల్లంతయ్యారు. ఒక్క కేర్ కౌంటీలోనే 43 మంది చనిపోయారని, వారిలో 15 మంది చిన్నారులున్నారని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో వరద ఉధృతి మొదలైనట్లు పేర్కొన్నారు.