Elon Musk: నా ఆఫర్‌ను తిరస్కరించారు.. సునీత రిటర్న్ జర్నీపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 10:14 AM
వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు చేర్చిన నాసా, స్పేస్ ఎక్స్ బృందాలకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ కూడా ధన్యవాదాలు తెలిపారు.

ఇంటర్నె్ట్ డెస్క్: తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నానా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు సురక్షితంగా తిరిగి రావడంపై టెక్ ఆంత్రప్రెన్యూర్, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు. సునీతను విజయవంతంగా భూమికి చేర్చినందుకు నాసా, స్పేస్ ఎక్స్ బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్‌ను అత్యంత ప్రాధాన్యామిచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు (Elon Musk on Sunita williams safe return).
సునీత రాక సందర్భంగా ఫాక్స్ న్యూస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ పలు ఆరోపణలు చేశారు. ఇంతకంటే ముందుగానే తాను వ్యోమగాములను తిరిగి తీసుకొస్తానని ప్రతిపాదిస్తే అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారని అన్నారు. రాజకీయ కారణాలతో వద్దని అన్నారని ఆరోపించారు.
Also Read: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు
‘‘ఇంతకంటే ముందే వారిని తిరిగి తీసుకొస్తామని ఆఫర్ చేశాము. అందులో సందేహమే లేదు. వాస్తవానికి ఆస్ట్రొనాట్స్ 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి రావాలి. కానీ దాదాపు 10 నెలలు అక్కడే ఉండిపోవాల్సి రావడం వింతే. స్పేస్ ఎక్స్ వారికి కొద్ది నెలల్లోనే తిరిగి తీసుకొచ్చి ఉండేది. ఈ ప్రతిపాదనను మేము బైడెన్ ప్రభుత్వం ముందుంచాు. కానీ రాజకీయ కారణాలతో ఆ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది’’ అని మస్క్ అన్నారు.
వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అప్పగించినట్టు మస్క్ జనవరిలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆస్ట్రోనాట్స్‌ను బైడెన్ ప్రభుత్వం అక్కడే వదిలివేయాలని అనుకోవడం నిజంగా దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: భూమ్మీదకు సురక్షితంగా చేరిన సునీతా విలియమ్స్.. నెక్స్ట్ జరిగేది ఇదే..
గతేడాది జూన్ 5న సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ తరువాత 8 రోజులకు వారు మిషన్ పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం కావాల్సి వచ్చింది. కానీ సార్ట్‌లైనర్ క్యాప్సూల్‌లో గ్యాస్ లీక్ అవుతున్నట్టు గుర్తించిన నాసా వారి తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసింది. వ్యోమనౌకకు తాత్కాలిక మరమ్మతులు చేద్దామనుకున్నా కుదరలేదు. ఇలా పలుకారణాలతో వారి తిరుగుప్రయాణం ఏకంగా 9 నెలల పాటు వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు ఇద్దరు ఆస్ట్రోనాట్స్.. స్పే్స్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్రూ క్యాప్సూల్‌లో సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
Read Latest and International News