Share News

Elon Musk Fires Back: ట్రంప్ గాలి తీసిన మస్క్.. ఇలా అంటాడనుకోలేదు..

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:55 PM

Elon Musk Fires Back: మస్క్ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మస్క్.. ట్రంప్ గాలి తీసేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ట్రంప్.. మస్క్‌ల మధ్య ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‘ చిచ్చు పెట్టింది. ఆ బిల్లును మస్క్ మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు.

Elon Musk Fires Back: ట్రంప్ గాలి తీసిన మస్క్.. ఇలా అంటాడనుకోలేదు..
Elon Musk Fires Back

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు. మస్క్ కొత్త పార్టీ ప్రారంభించటంపై ట్రంప్ స్పందించారు. మస్క్‌ దారుణమైన పరిస్థితిలో ఉన్నాడని అన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్’లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సాయర్ మెర్రిట్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.


‘ట్రంప్ ట్రూత్ సోషల్‌లో మస్క్ గురించి ఇప్పుడే ఓ పోస్టు పెట్టాడు’ అని రాసుకొచ్చాడు. సాయర్ మెర్రిట్ పోస్టుపై మస్క్ స్పందించాడు. ‘ట్రూత్ సోషల్ అంటే ఏంటి?.. నేనెప్పుడూ దాని గురించి వినలేదే’ అంటూ వ్యంగ్యంగా ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మస్క్.. ట్రంప్ గాలి తీసేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ట్రంప్.. మస్క్‌ల మధ్య ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‘ చిచ్చు పెట్టింది. ఆ బిల్లును మస్క్ మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ చెడింది.


బిల్లు అమలు చేస్తే తాను కొత్త పార్టీ పెడతానని మస్క్ ముందుగానే చెప్పాడు. ‘ది అమెరికా పార్టీ‘ అని పేరు కూడా ప్రకటించాడు. అయితే, ఆయన ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా బిల్లు అమల్లోకి వచ్చింది. దీంతో మస్క్ కొత్త పార్టీని ప్రారంభించాడు. ఈ కొత్త పార్టీపై ట్రంప్ సెటైర్లు వేశారు. ‘ట్రంప్ మూడో పార్టీ మొదలుపెట్టడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. అమెరికా రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థ. మూడో పార్టీ మొదలుపెట్టడం అంటే.. ప్రజల్ని తికమక పెట్టడమే. మూడో పార్టీ ఇక్కడ పని చేయదు’అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రియల్ హీరో.. హెయిర్ క్లిప్, కత్తితో మహిళకు కాన్పు చేసిన డాక్టర్..

త్రుటిలో తప్పించుకున్నాడు.. సరదాగా స్నానం చేద్దామని వెళితే ఏం జరిగిందో చూడండి..

Updated Date - Jul 07 , 2025 | 02:13 PM