Share News

మా స్టార్‌లింక్‌ సేవలు నిలిపేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలుతాయి: మస్క్‌

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:23 AM

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారంటూ ఇటీవల విమర్శించిన మస్క్‌..

 మా స్టార్‌లింక్‌ సేవలు నిలిపేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలుతాయి: మస్క్‌

వాషింగ్టన్‌, మార్చి 9: అమెరికా వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌.. ఉక్రెయిన్‌పై మరోసారి మండిపడ్డారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారంటూ ఇటీవల విమర్శించిన మస్క్‌.. తాజాగా తమ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తే యుద్ధక్షేత్రంలో కీవ్‌ సేనలు కుప్పకూలుతాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌ ఓటమి అనివార్యమైనప్పటికీ ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ మారణకాండ విసుగు తెప్పించిందని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. 2022 ఫిబ్రవరిలో రష్యా దాడితో ఉక్రెయిన్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతింది. దీంతో ప్రస్తుతం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ అక్కడ సేవలందింస్తోంది.

Updated Date - Mar 10 , 2025 | 03:23 AM