Donald Trump F-35 deal: సౌదీ అరేబియాకు అమెరికా ఎఫ్-35 ఫైటర్లు.. భారత్‌కు ఇబ్బందికరమేనా?
ABN , Publish Date - Nov 19 , 2025 | 08:43 AM
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు.
గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న అమెరికా-సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు. F-35 స్టెల్త్ ఫైటర్ అమెరికా తయారు చేసిన అత్యాధునిక యుద్ధ విమానం (Donald Trump F-35 deal).
రాడార్‌కు దొరకని సామర్థ్యం, కచ్చితమైన దాడి చేయగల నైపుణ్యం, అత్యంత అభివృద్ధి చెందిన డిజిటల్ ఇంటిగ్రేషన్ లాంటి లక్షణాలతో F-35 సూపర్ జెట్ ఫైటర్‌గా ఉంది. ప్రస్తుతం అమెరికా వీటిని తనకు అత్యంత దగ్గరైన, మిత్ర దేశాలకు మాత్రమే విక్రయిస్తోంది. త్వరలో సౌదీ అరేబియా కూడా వీటిని పొందబోతోంది. ప్రస్తుతానికి ఈ డీల్ ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. ఒకవేళ ఈ డీల్ పూర్తయితే భారత్ కాస్త ఆందోళన చెందాల్సిందే (Saudi Arabia F-35 sale).
చారిత్రకంగా పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ప్రధాన మద్దతుదారు (India worried F-35). ఇటీవల ఈ రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కూడా జరిగింది. సౌదీ రక్షణ శక్తి పెరిగితే, అది పాకిస్థాన్ వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది భారత్‌కు చింత కలిగించే అంశం. అలాగే సౌదీ అరేబియా, చైనా మధ్య సంబంధాల్లో కూడా ఇటీవలి కాలంలో పురోగతి కనిపిస్తోంది. అందుకే ఈ డీల్ విషయంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వాషింగ్టన్‌తో చర్చలు జరిపి ఈ డీల్ విషయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..
చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి