Share News

Donal Trump: ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు: ట్రంప్

ABN , Publish Date - Jul 19 , 2025 | 03:25 PM

భారత్-పాక్ యుద్ధంలో ఐదు విమానాలను గాలిలోనే కూల్చేశారని ట్రంప్ తెలిపారు. తన అంచనా ప్రకారం ఐదు జెట్ విమానాలను కూల్చేశారని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ఆయన స్పష్టం చేయలేదు.

Donal Trump: ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు: ట్రంప్
Donald Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donal Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన భారత్- పాకిస్థాన్ యుద్ధంలో ఐదు విమానాలను కూల్చేశారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో రిపబ్లికన్ సెనేటర్లకు ఇచ్చిన విందులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్-పాక్ ఉద్రిక్తతల్లో ఐదు విమానాలను గాలిలోనే కూల్చేశారని చెప్పారు. తన అంచనా ప్రకారం ఐదు జెట్ విమానాలను కూల్చేశారని అనుకుంటున్నానని చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ఆయన స్పష్టం చేయలేదు.


ఇరుగుపొరుగున ఉన్న రెండు శక్తివంతమైన అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగడంతో ఉద్రిక్తతలను తొలగించేందుకు తాము కలుగజేసుకుని పరిష్కరించామన్నారు. 'వాణిజ్యాన్ని చూపించి యుద్ధాన్ని ఆపేశాను. మేము చాలా యుద్ధాలను ఆపాం. అయితే ఇది చాలా సీరియస్. ఇండియా-పాక్ యుద్ధంలో విమానాలు కూల్చివేసుకున్నారు. ఐదు జెట్ల వరకూ కూల్చేశారని అనుకుంటున్నా. రెండూ అణ్వస్త్రదేశాలు ఒకరితో ఇంకొకరు తలబడుతున్నారు. మీరు ఆయుధాలు ప్రయోగించుకుంటుంటే మీతో వాణిజ్య ఒప్పందం చేసుకునేది లేదని నేను చెప్పా. మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తీవ్రమైన చాలా యుద్ధాలను ఆపాం. ఇందుకు నేను గర్వపడుతున్నా' అని ట్రంప్ అన్నారు.


కాగా, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ట్రంప్ ఇటీవల పలుమార్లు ప్రకటించుకున్నారు. అయితే ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. మే 10న భారత్-పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్స్ మధ్య సంభాషణలు జరిగిన అనంతరం కాల్పుల విరమణకు నిర్ణయించినట్టు తెలిపింది.


ఇవి కూడా చదవండి..

టీఆర్‌ఎఫ్‌ ప్రపంచ ఉగ్రవాద సంస్థ అమెరికా

గడువులోపే భారత అమ్ముల పొదిలోకి ఏకే 203 తుపాకులు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:30 PM