Robotics: మరమనుషుల హాఫ్ మారథాన్
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:43 AM
రోబోటిక్స్‌లో అమెరికాతో పోటీపడుతున్న చైనా.. కృత్రిమ మేధ రంగంలో తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటేలా ఓ అద్భుతాన్ని ప్రదర్శించింది.

ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో రోబోల పరుగు పందెం
బీజింగ్, ఏప్రిల్ 19 : రోబోటిక్స్‌లో అమెరికాతో పోటీపడుతున్న చైనా.. కృత్రిమ మేధ రంగంలో తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటేలా ఓ అద్భుతాన్ని ప్రదర్శించింది. ప్రపంచంలోనే తొలిసారిగా హ్యుమనాయిడ్ రోబోలకు పరుగు పందెం.. అది కూడా హాఫ్ మారథాన్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించి.. ఔరా అనిపించింది. బీజింగ్ ఈ-టౌన్‌గా పిలువబడే బీజింగ్ ఎకనమిక్ - టెక్నలాజికల్ డెవల్‌పమెంట్ ఏరియా ఈ అద్భుతానికి వేదికైంది. 21 కిలోమీటర్ల పరుగు పందెం(హాఫ్ మారథాన్)లో 21 హ్యుమనాయిడ్ రోబోలు పోటీ పడి పరుగు తీశాయి.
వేర్వేరు విశ్వవిద్యాలయాలు, సంస్థలు అభివృద్ధి చేసిన, దేనికదే ఆకారంలో ప్రత్యేకంగా ఉండే రోబోలు పోటీలో పాల్గొన్నాయి. రోబోలను అభివృద్ధి చేసిన సాంకేతిక బృందాల సభ్యులు కూడా తమతమ రోబోలతో కలిసి పరుగుడెతూ అవి గమ్యస్థానాన్ని చేరుకునేలా చేశారు. ఈ హాఫ్ మారథాన్‌లో తియంగాంగ్ జట్టుకు చెందిన తియంగాంగ్ అలా్ట్ర రోబో 2 గంటల 40 నిమిషాల్లో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి..