Blue Origin rocket: అంగారకుడి పైకి ప్రయాణం ప్రారంభం.. ఎస్కపేడ్ ప్రయోగం విజయవంతం..
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:18 AM
సౌర తుఫాను, వాతావరణ సమస్యలు వంటి కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న 'ఎస్కపేడ్' మిషన్ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరెల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
సౌర తుఫాను, వాతావరణ సమస్యలు వంటి కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న 'ఎస్కపేడ్' మిషన్ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరెల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అమెజాన్ అధిపతి, అపర కుబేరుడు అయిన జెఫ్ బెజోస్‌కు చెందిన 'బ్లూ ఆరిజన్' సంస్థకు చెందిన అతి శక్తివంతమైన రాకెట్ 'న్యూ గ్లెన్' అంతరిక్ష నౌకను నింగిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం సదరు రాకెట్ క్షేమంగా భూమి మీదకు తిరిగి వచ్చింది (Blue Origin launch).
నాసా చేపట్టిన ఈ 'ఎస్కపేడ్' మిషన్‌లో రెండు ఉపగ్రహాలున్నాయి (NASA twin spacecraft). బ్లూ, గోల్డ్ పేర్లు కలిగిన ఈ రెండు ఉపగ్రహాలు అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి. అంగారక గ్రహం తన వాతావరణాన్ని ఎలా కోల్పోయిందో ఇవి అధ్యయనం చేయబోతున్నాయి. అలాగే మార్స్ గ్రహం అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా వాతావరణాన్ని పరిశోధించనున్నాయి. ఈ 'ఎస్కపేడ్' అంతరిక్ష నౌక ఒక ఏడాది పాటు భూకక్ష్యలోనే తిరుగుతుంది. 2027 నాటికి అంగారకుడి కక్ష్యలోకి చేరుతుంది. అంటే ఈ అంతరిక్ష నౌక ప్రయాణం రెండు సంవత్సరాల పాటు సాగుతుంది (NASA Mars mission).
ఈ అంతరిక్ష నౌక అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బ్లూ, గోల్డ్ ఉపగ్రహాలు తన పనిని మొదలుపెడతాయి. కాగా, జంబో రాకెట్‌ను రూపొందించిన 'బ్లూ ఆరిజన్' ఓ నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టింది (Blue Origin rocket). ఇప్పటివరకు ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వద్ద మాత్రమే మళ్లీ ఉపయోగించుకోగల రాకెట్లను తయారు చేసే టెక్నాలజీ ఉండేది. తాజాగా బ్లూ ఆరిజన్ కూడా ఆ టెక్నాలజీని విజయవంతంగా ప్రయోగించి స్పేస్ ఎక్స్‌కు పోటీగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి