Share News

Bilwal Bhutto: కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై దెబ్బతిన్నాం.. ఒప్పుకున్న బిలావల్ భుట్టో

ABN , Publish Date - Jun 04 , 2025 | 03:55 PM

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా ఇటీవల తలెత్తిన ప్రాంతీయ ఉద్రిక్తతలపై పాక్ వాదనను వినిపించేందుకు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఎంపీల బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది.

Bilwal Bhutto: కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై దెబ్బతిన్నాం.. ఒప్పుకున్న బిలావల్ భుట్టో

న్యూయార్క్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) అంగీకరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భుట్టో మాట్లాడుతూ, ఐరాసాలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కలేదన్నారు.


పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా ఇటీవల తలెత్తిన ప్రాంతీయ ఉద్రిక్తతలపై పాక్ వాదనను వినిపించేందుకు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఎంపీల బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా బిలావల్ భుట్టో మాట్లాడుతూ, ఉగ్రవాదంపై ఇండియా పోరాటానికి సహకరించేందుకు ఇప్పటికీ పాక్ సిద్ధంగానే ఉన్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య వివాదాల పరిష్కార వ్యవస్థను తీసుకు రావడం అసాధ్యమని, అయితే రెండు దేశాల నిఘాసంస్థలు కలిసి ఉగ్రవాద శక్తులపై పోరాటం చేస్తే ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుతాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు.


సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడంపై ఇటీవల దురుసు వ్యాఖ్యలు చేసిన బిలావల్ భుట్టో ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, ప్రజాభిప్రాయాన్నే తాను వెల్లడించాడని చెప్పారు. తాజాగా ఆపరేషన్ సిందూర్‌తో పాక్ మిలటరీకి గట్టి దెబ్బ తగలడంతో ఆయన స్వరం మార్చుకున్నట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. భారత్ ఇటీవల జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం 6 పాక్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్‌లు, రెండు స్ట్రాటజిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక సి-130 ట్రాన్స్‌పోర్టర్, 10కి పైగా యూసీఏవీలు ధ్వంసమయ్యాయి.


ఇవి కూడా చదవండి..

జైషే టాప్ కమాండర్‌ ఖతం.. మరణంపై మిస్టరీ

పాకిస్థాన్ మిత్రులు చైనాలో ఉన్నారు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 05:38 PM