Share News

Apple To Invest: అమెరికాలో ఆపిల్‌ 8.32 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:08 AM

అమెరికాలో తయారీ విభాగాన్ని బలోపేతం చేయడానికి యాపిల్‌ సంస్థ రూ.8.32 లక్షల కోట్ల

Apple To Invest: అమెరికాలో ఆపిల్‌ 8.32 లక్షల కోట్ల పెట్టుబడులు

వాషింగ్టన్‌, ఆగస్టు 6: అమెరికాలో తయారీ విభాగాన్ని బలోపేతం చేయడానికి యాపిల్‌ సంస్థ రూ.8.32 లక్షల కోట్ల(100 బిలియన్‌ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వైట్‌హౌస్‌ అధికారి టేలర్‌ రోజర్స్‌ వెల్లడించారు. తయారీ రంగంలో ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావాలనే ప్రయత్నాలకు ఈ నిర్ణయం ఊతమిస్తుందని ఆ అధికారి ‘రాయిటర్స్‌’తో అన్నారు. రానున్న నాలుగేళ్లలో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫిబ్రవరిలో యాపిల్‌ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెక్స్‌సలో ఏఐ సర్వర్ల తయారీ ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇక్కడ పరిశోధన-అభివృది రంగంలో 20 వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. అయితే.. ఈ పెట్టుబడుల గురించి అటు యాపిల్‌ సంస్థ గానీ, ఇటు ట్రంప్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:08 AM