Share News

Israel Attack Syria: లైవ్‌లో ఉండగానే యాంకర్ పరుగో పరుగు

ABN , Publish Date - Jul 16 , 2025 | 07:53 PM

దక్షిణ సిరియాలోని స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య గత ఆదివారం సాయుధ ఘర్షణ ప్రారంభమైంది.

Israel Attack Syria: లైవ్‌లో ఉండగానే యాంకర్ పరుగో పరుగు

డమాస్కస్: ఇజ్రాయెల్-సిరియా (Israel-Syria) మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియా రాజధాని డమాస్కస్‌‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. స్టేట్ టీవీ బిల్డింగ్‌ను ఒక బాంబు తాకడంతో ఆ సమయంలో లైవ్‌ ప్రసారంలో ఉన్న యాంకర్ మధ్యలోనే కార్యక్రమానికి విడిచిపెట్టి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్ అవుతోంది.


'డమాస్కస్‌కు హెచ్చరికలు చేయంది అయిపోయింది. ఇక బడితపూజ తప్పదు' అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. స్వెయిదా ప్రాంతంపై ఇజ్రాయెల్ మిలటరీ భీకర దాడులు కొనసాగిస్తుందని హెచ్చరించారు.


దక్షిణ సిరియాలోని స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య గత ఆదివారం సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ప్రపంచంలో ద్రూజ్ జాతీయుల పది లక్షల మంది వరకూ ఉండగా సగం మంది సిరియాలో ఉన్నారు. దీంతో ఈ ఘర్షణల్లో ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. సిరియాలోని ద్రూజ్ జాతిని కాపాడతామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇందుకు ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రిగా తాను కట్టుబడి ఉన్నట్టు కాట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్ బాంబు టీవీ బిల్డింగ్‌‌ను తాకడంతో లైవ్‌లో ఉన్న యాంకర్ పరుగులు తీస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు.


ఇవి కూాడా చదవండి..

మాస్కోని కొట్టగలవా.. జెలెన్‌స్కీకి ట్రంప్ సూటిప్రశ్న

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 07:58 PM