Share News

Yoga For Diabetes: మీకు డయాబెటిస్ ఉందా.. కంట్రోల్ చేయాలంటే ఈ ఆసనాలు ట్రై చేయండి..

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:56 PM

డయాబెటిస్ ఉన్నవారికి వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ ఆసనాలు చేయడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Yoga For Diabetes: మీకు డయాబెటిస్ ఉందా.. కంట్రోల్ చేయాలంటే ఈ ఆసనాలు ట్రై చేయండి..
Yoga For Diabetes

Yoga For Diabetes: డయాబెటిస్ ఉన్నవారికి వ్యాయామం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వ్యాయామం ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలంటే నడక, జాగింగ్ తోపాటు ఈ ఆసనాలు చేయడం మంచిదని నిపుణులు చెబుతునున్నారు. అయితే, షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్ చేయడానికి ఏ ఆసనాలు చేయాలి? ఎంత సమయం వరకు చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


భుజంగాసనం

భుజంగాసనం.. దీనినే కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఇది వెన్నెముకకు శక్తినిచ్చే ఒక యోగా ఆసనం. ఈ భంగిమలో, శరీరం నాగుపాము వలె కనిపిస్తుంది. కాబట్టి దీనికి కోబ్రా భంగిమ అనే పేరు వచ్చింది. ఇది ఛాతీ, భుజాలు, పొత్తికడుపుని విస్తరింపజేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణ అవయవాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

Bhujangasana.jpg


మకరాసనం

మకరాసనం అనేది యోగాలో ఒక ఆసనం. దీనిని మొసలి భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి బోర్లా పడుకుని, చేతులపై తల ఆనించాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. ఇది వెన్నెముక, పొట్ట కండరాలకు విశ్రాంతినిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది.

Makarasana .jpg


అర్ధ మత్స్యాసనం

అర్ధ మత్స్యాసనం.. సంస్కృతంలో 'అర్ధ మత్స్యేంద్రాసనం' అని కూడా పిలుస్తారు. ఇది ఒక యోగా భంగిమ. వీపు, మొండెం, శరీరానికి ఒక వైపు తిప్పి.. చేతులను మోకాళ్లపైన పెట్టుకోవాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. ఇది వెన్నెముకను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఈ భంగిమ చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 

Matsyendrasana.jpg


మండూకాసనం

మండూకాసనం అనేది ఒక యోగా భంగిమ. దీనిని 'కప్ప భంగిమ' అని కూడా అంటారు. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని వజ్రాసనంలో కూర్చొని, చేతులను పిడికిలిలా బిగించి పొట్టపై పెట్టి, ముందుకు వంగి చేస్తారు. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. ఈ ఆసనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. 

Mandukasana.jpg


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

మీ ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉండాలంటే..కుర్చీపై కూర్చొని

వర్షాకాలం.. వీటిని అస్సలు తినకండి..

For More Health News

Updated Date - Jun 20 , 2025 | 05:25 PM