Tomato Side Effects: కిడ్నీలో రాళ్లు రావడానికి టమాటాలు కారణమా..?
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:03 AM
నిత్యం వినియోగించే టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి, బీపీ నియంత్రణకు సహకరిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: టమాటాలు మనం నిత్యం ఇంట్లో వినియోగిస్తూనే ఉంటాం. వివిధ రకాలుగా టమాటాకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటాము. ఇది అందుబాటు ధరల్లో దొరకడం వల్ల.. పేద, మధ్య తరగతి వారు తినే ఆహారంలో ఎక్కువగా ఉపాయోగిస్తారు. దీని దాదాపుగా అన్ని వంటల్లోనూ వాడతారు. టమోటా రుచితో పాటుగా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నవిగా చెబుతారు. అయితే, టమాటా వల్ల ఎన్ని లాభాలుంటాయో.. నష్టాలూ అంతే ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమాటాలు రోజూ తింటే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయనే ఒక అపోహ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, నిజంగా టమాటా కారణంగా మూత్ర పిండాల్లో రాళ్లు వస్తాయా.. అసలు టమాటాకు ఎవరు దూరంగా ఉండాలనే అంశాలను ఇప్పుడు చూద్దాం..
నిత్యం వినియోగించే టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి, బీపీ నియంత్రణకు సహకరిస్తుంది. టమోటాలోని విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. జీర్ణ శక్తిని పెంచుతాయి. అయితే, టమాటాలలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవి రాళ్లలా గట్టిగా మారుతాయి. క్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతాయి. ఇదివరకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా టమాటాలు తింటే సమస్య మరింత తీవ్రమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల సమస్యలు ఉంటే పచ్చి టమాటాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లెమ్స్ లేని వ్యక్తులు నిస్సంకోచంగా టమాటాలు తినవచ్చు. కానీ తగిన పరిమాణంలో తినాలి. అలాగే, టమాటాలతో పాటు ఇతర ఆహారాలను కూడా తప్పక తీసుకోవాలి. టమాటాలు రోజూ తింటే బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయని చెబుతున్నారు. టమాటాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. కాబట్టి, అధిక మోతాదులో టమాటాలను తీసుకునే వారు లేదా టమాటా ప్యూరీలు, సాస్ వంటి ప్రాసెస్డ్ ఫార్ముల్లో వీటిని తరచుగా ఉపయోగించే వారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం