Share News

Sleeping Disorder: 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు తప్పవు..

ABN , Publish Date - Jul 01 , 2025 | 09:23 AM

చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

Sleeping Disorder: 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు తప్పవు..
Sleeping

Sleeping Disorder: నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరం, మెదడు రెండింటికీ విశ్రాంతినిస్తుంది. కణాలను పునరుద్ధరిస్తుంది. వివిధ శారీరక, మానసిక విధులను మెరుగుపరుస్తుంది. తగినంత నిద్రపోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సాధారణంగా 7-8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


గుండె జబ్బుల ప్రమాదం:

నిద్ర లేమి వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిద్ర లేమి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ధమనులలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ ప్రమాదం

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంటే మీ కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి.


మానసిక ఆరోగ్యంపై ప్రభావం

నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిరాకు, ఒత్తిడి పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఎన్ని పనులున్నా 7-8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం

నిద్రలేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి, రోజు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఈ 5 అలవాట్లు పాటిస్తే.. వయస్సు పెరిగినా అందం తగ్గదు..

చర్మం, పాదాలపై కనిపించే ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతమా..

For More Health News

Updated Date - Jul 01 , 2025 | 10:27 AM