Share News

Trick To Know Good Eggs: గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో .. సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో ఇలా ట్రై చేయండి..

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:45 PM

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ, గుడ్లు అన్ని మంచిగా ఉండవు. కొన్ని చెడిపోయి కూడా ఉంటాయి. అయితే, గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Trick To Know Good Eggs: గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో .. సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో ఇలా ట్రై చేయండి..
Eggs

Trick To Know Good Eggs: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన గుడ్లు చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. కానీ, కొన్ని గుడ్లు బయటకు మంచిగా కనిపించినా పగలగొట్టి చూస్తే చెడిపోయి ఉంటాయి. అయితే, మనం గుడ్లను పగలగొట్టకుండానే గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఫోన్ ఫ్లాష్‌లైట్‌‌తో..

ఇటీవల, ఫిట్‌నెస్ స్పెషలిస్ట్ ప్రణవ్ జాండియల్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో అతను మంచి గుడ్డును చెడు గుడ్డు ఎలా గుర్తించాలో ఒక సింపుల్ ట్రిక్ ద్వారా చేసి చూపించాడు. ముందుగా, అతను కొన్ని గుడ్లను తీసుకున్నాడు. తర్వాత తన ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసి, గుడ్డును లైట్ పైన ఉంచాడు. గుడ్డు లోపల నుండి పసుపు రంగుతో మెరుస్తుంటే అది తాజాగా ఉంటుందని, ఉపయోగించడానికి సురక్షితం అని తెలిపాడు. అయితే, తక్కువ లేదా వెలుతురు లేకపోతే, ఆ గుడ్డు చెడిపోయిందని సంకేతం అని వివరించాడు. కుళ్ళిన గుడ్డును పగలగొట్టే ముందే ఫ్లాష్‌లైట్ పద్ధతి ద్వారా దానిని గుర్తించవచ్చని తెలిపాడు.


ఈ వేసవిలో, వేడి కారణంగా ఎక్కువ కుళ్ళిన గుడ్లు కనిపించడం చాలా సాధారణమని, పైన చూపిన విధంగా గుడ్డును ఉపయోగించే ముందు సెల్ ఫోన్ లైట్‌తో టెస్ట్ చేయాలని సూచించారు. తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలని సూచించారు.


Also Read:

Kerala: దివ్యాంగుల కేంద్రానికి హెడ్గేవార్ పేరు..రణరంగంగా మారిన కౌన్సిల్ సమావేశం

CM Chandrababu: కానిస్టేబుల్ టు ఐపీఎస్.. ఉదయ కృష్ణారెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

Humanitarian Judge: నిందితుల వద్దకే న్యాయమూర్తి.. ప్రజల ప్రశంసల వెల్లువ

Updated Date - Apr 29 , 2025 | 05:33 PM