Winter Weight Loss Tips: శీతాకాలంలో ఈ మూడు చిట్కాలతో సులభంగా బరువు తగ్గండి..
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:49 PM
చలికాలంలో బరువు తగ్గడం చాలా సవాలుతో కూడుకున్నది. శీతాకాలంలో జిమ్ లేదా పార్కుకు వెళ్లాలని మీకు అనిపించకపోతే, మీరు...
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో బరువు పెరగడం ఒక సాధారణ సమస్య. దీనికి పలు కారణాలు ఉన్నాయి. చల్లని వాతావరణం వల్ల చాలా మంది బయట వ్యాయామాలు చేయడానికి ఇష్టపడరు, దీనివల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. అలాగే, ఈ సీజన్‌లో బాగా వేడిగా ఉన్న ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా బయట ఫుడ్స్ తింటారు. ఇలా అధికంగా ఆహారం తీసుకోవడం, నిద్ర అలవాట్లలో మార్పులు, శరీర జీవక్రియ నెమ్మదిగా ఉండటం వంటి కారణాలు బరువు పెరిగేలా చేస్తాయి. అయితే, శీతాకాలంలో సులభంగా బరువు తగ్గాలంటే ఈ 3 చిట్కాలను తప్పకుండా ప్రయత్నించండి..
ఇంట్లో సులభమైన కార్యకలాపాలు
శీతాకాలంలో జిమ్‌కు లేదా పార్క్‌కు వెళ్లాలని అనిపించకపోతే, కొన్ని ఇండోర్ కార్యకలాపాలు చేయడం మంచిది. ఇంట్లోనే సూర్య నమస్కారం చేయండి. స్కిపింగ్ చేయండి. మెట్లు ఎక్కడం, నృత్యం చేయడం వంటివి ఇంట్లో చురుకుగా ఉండటానికి సహాయపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
మితంగా తినండి
మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తినండి. బయట ఫుడ్స్ తినడం మానేయండి.
నీరు ఎక్కువగా తీసుకోండి
శీతాకాలంలో చాలా మంది తక్కువగా నీరు తాగుతారు. కానీ ఈ పొరపాటు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. డీహైడ్రేషన్ కొవ్వును కాల్చే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, శీతాకాలంలో మీరు ఎప్పటిలాగే ఎక్కువ నీరు తాగలేకపోతే గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నించండి.
Also Read:
ప్లాస్టిక్ బాటిల్స్ అంత ప్రమాదమా..? నివేదికలో షాకింగ్ విషయాలు
ఐ బొమ్మ రవి కేసు.. బెయిల్ వస్తుందా?
For More Latest News