Share News

Coffee: రోజూ మూడు కప్పుల కాఫీ మంచిదే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 06:57 AM

రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని పలు ఆరోగ్య నివేదికలు తేల్చాయని, బ్లాక్‌ కాఫీ మరింత ఉత్తమమని స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీఎం పూర్ణేష్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియా ఇంటర్నేషనల్‌ కాఫీ ఫెస్టివల్‌ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Coffee: రోజూ మూడు కప్పుల కాఫీ మంచిదే..

- నేటి నుంచి ఇండియా ఇంటర్నేషనల్‌ కాఫీ ఫెస్టివల్‌

- హాజరు కానున్న 80కిపైగా కంపెనీలు

బెంగళూరు: ప్రతి మనిషి రోజూ మూడు కప్పులు తాగడం ఆరోగ్యానికి మంచిదేనని పలు ఆరోగ్య నివేదికలు తేల్చాయని, బ్లాక్‌ కాఫీ మరింత ఉత్తమమని స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీఎం పూర్ణేష్‌(Coffee Association President PM Purnesh) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇండియా ఇంటర్నేషనల్‌ కాఫీ ఫెస్టివల్‌ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిసారి జరగనున్న ఈ ఫెస్టివల్‌లో 80మందికి పైగా ఎగ్జిబిటర్స్‌ పాల్గొంటున్నారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Terror Attack: ఖాళీ అవుతున్న కశ్మీరం


దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాఫీ పండిస్తున్నారని సుమారు రెండున్నరలక్షల హెక్టార్లలో సాగు అవుతోందన్నారు. ఇందులో 70శాతం కర్ణాటకలోనే సాగు చేస్తున్నారన్నారు. కాఫీ ఉత్పత్తిలో 70శాతం విదేశాలకు ఎగుమతి అవుతుండగా అందులో 50శాతం యూరఫ్‌ దేశాలకు వెళ్తోందన్నారు. దేశీయ కాఫీ ప్రధానంగా జర్మనీ, బెల్జియం, రష్యా, టర్కీలతో పాటు యుఏఈతో పాటు 120దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు.


pandu1.2.jpg

కాఫీ బోర్డు ద్వారా కాఫీ ఉత్పత్తిదారులతో పాటు పారిశ్రామికవేత్తలు, స్టార్ట్‌్‌పలకు రాయితీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫెస్టివల్‌(Festival)లో 15 సెషన్‌ల చర్చాగోష్టులు ఉంటాయన్నారు. చామర వజ్రలో జరిగే కాఫీ ఫెస్టవల్‌లో పాల్గొనదలచినవారు ముందుగా టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడురోజుల ఫెస్టివల్‌కు కనీసం 15వేల మందికిపైగా సందర్శకులు పాల్గొంటారని అంచనా వేశామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ భద్రతపై కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు

పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!

కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 25 , 2025 | 06:57 AM