Banana for BP: అరటితో బిపి దూరం
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:13 AM
అరటిలో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకో అరటిపండు తినడం వల్ల బిపి నియంత్రణలో ఉంటుంది

తెలుసుకుందాం
అధిక రక్తపోటున్న వాళ్లు రోజుకొక అరటిపండు తినాలంటున్నారు వైద్యులు. ఎందుకో తెలుసుకుందాం!
అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఒక అరటిపండులో దాదాపు 400 నుంచి 450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అది మన దైనందిన పొటాషియం పరిమాణంలో పది శాతంతో సమానం. ఇంతకూ రక్తపోటుకూ పొటాషియంకూ సంబంధం ఏంటో తెలుసుకుందాం! పొటాషియం శరీరంలోని సోడియం దుష్ప్రభావాలను కుంటు పరుస్తుంది. ప్రాసెస్డ్ పదార్థాలు, చిరుతిళ్లు, నిల్వ పచ్చళ్లు, హోటల్ భోజనాల ద్వారా మనం అవసరానికి మించి ఉప్పు తింటూ ఉంటాం.
ఈ సోడియం శరీరంలో నీటి నిల్వను పెంచుతుంది. ఫలితంగా రక్తపు పరిమాణం పెరిగి, రక్తపోటు పెరుగుతుంది. ఈ అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో పొటాషియం సహాయపడుతుంది. కాబట్టి ఉదయం అల్పాహారానికీ, మధ్యాహ్న భోజనానికీ మధ్య ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండుతో పాటు గ్లాసుడు నీళ్లు, గుప్పెడు నట్స్ కూడా తీసుకోవడం ఆరోగ్యకరం.
ఇవి కూడా చదవండి:
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?