Share News

Coconut Water Vs Sugarcane Juice: కొబ్బరి నీళ్లా.. చెరుకు రసమా.. హెల్త్‌కు ఏది బెస్ట్

ABN , Publish Date - May 05 , 2025 | 12:37 PM

Coconut Water Vs Sugarcane Juice: సమ్మర్‌లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూస్‌లు, చల్లటి పానీయాలను తీసుకుంటారు ప్రజలు. వాటిలో కోకోనట్ వాటర్, చెరుకు రసం కూడా ముఖ్యమైనవనే చెప్పుకోవాలి.

Coconut Water Vs Sugarcane Juice: కొబ్బరి నీళ్లా.. చెరుకు రసమా.. హెల్త్‌కు ఏది బెస్ట్
Coconut Water Vs Sugarcane Juice

సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరాలకు బయటకు వచ్చినా కూడా ఎండదెబ్బ తగులకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. శరీరంలో ఎనర్జీని తెచ్చుకునేందుకు జ్యూస్‌ల వైపు మొగ్గుచూపుతుంటారు. తీవ్రమైన ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలను తీసుకుంటారు. కొందరు ఇళ్లలోనే పండ్ల జ్యూస్‌లను చేసుకుంటారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రం చెరుకు రసం, కొబ్బరి నీళ్లు తాగడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. వేసవి వచ్చేయడంతో ఇప్పుడు మార్కెట్లలో ఎక్కడపడితే అక్కడ చెరుకు రసం బండ్లు, కొబ్బరి బోండాలు దర్శనమిస్తున్నాయి. తమ దాహార్తిని తీర్చుకోవడానికి చెరుకు రసం, కొబ్బరి నీళ్లను తాగుతుంటారు ప్రజలు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుంది. ఏ పానీయం ఆరోగ్యానికి మంచిది. ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.


కొబ్బరి నీటి ప్రయోజనాలు

కొబ్బరి నీళ్లు, చెరుకు రసం రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ కొబ్బరి నీళ్లకు మాత్రం కాస్త డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవాలి. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువును నియంత్రించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. కొబ్బరి నీళ్లను తరచూ తీసుకోవడం వల్ల చర్మం మిలమిలా మెరిసిపోవడం ఖాయం. యవ్వనంగా కూడా కనిపిస్తారు.

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్


చెరుకు రసం వల్ల

ఇక చెరుకు రసం గురించి తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. చెరుకు రసం తాగడం వల్ల తక్షణ శక్తిని పొందుతారు. చెరుకు రసంలో మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ రసాన్ని తరచూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని చెరుకు రసం ద్వారా పొందవచ్చు. శరీరంలో విష పదార్థాలను కూడా ఈ షుగర్ కేన్ తొలగిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయాన్ని రక్షిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. అయితే డయాబెటీస్ మాత్రం ఈ చెరుకు రసాన్ని మితంగా తీసుకోవడం మంచిది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు కూడా చెరుకు రసానికి దూరంగా ఉండటమే బెటర్.


రెండింటిలో ఏది బెస్ట్

అయితే చెరుకు రసం, కొబ్బరి నీళ్లలో ఏది బెస్ట్ అంటే మాత్రం కొబ్బరి నీళ్లే బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చెరుకు రసం కంటే కొబ్బరి నీళ్లే ఆరోగ్యకరమైనవి. చెరుకు రసంలో కేలరీలు, చెక్కర కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని వల్ల ఊబకాయం వచ్చే అవకాశమూ లేకపోలేదు. అయితే కొబ్బరి నీళ్లు మాత్రం శరీరాన్ని హైడ్రేడెట్‌గా ఉంచుతుంది.


ఇవి కూడా చదవండి

Pakistan Russia Diplomacy: రష్యాను వేడుకున్న పాకిస్తాన్..భారత్‎తో చర్చించండి ప్లీజ్..

West Bengal Shocking Incident: షాకింగ్ ఘటన.. భార్య ముక్కు అందంగా ఉందన్నాడు.. చివరకు

Read Latest Health News And Telugu News

Updated Date - May 05 , 2025 | 12:37 PM