Climate Impact On Kids: వాతావరణం ఎఫెక్ట్.. పిల్లల్లో 25% పెరిగిన అండర్‌వెయిట్ రిస్క్
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:30 PM
వాతావరణ మార్పు కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దుర్బల జిల్లాల్లో పిల్లల్లో అండర్‌వెయిట్ రిస్క్ 25% పెరిగినట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు వాయు కాలుష్యంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం కారణంగా ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. తీవ్రమైన శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇదిలా ఉంటే, ఈ వాతావరణ మార్పు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా, భారతదేశంలోని దుర్బల జిల్లాల్లో వాతావరణ ఎఫెక్ట్ వల్ల అండర్‌వెయిట్ రిస్క్ 25% పెరిగినట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది. ఒక అధ్యయనం ప్రకారం, వాతావరణ మార్పులకు ఎక్కువగా గురయ్యే జిల్లాలు మెరుగైన ఆరోగ్య సేవలు పొందడంలో వెనుకబడుతున్నాయి. మహిళల్లో ప్రసవాలు ఆస్పత్రుల బయట జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా.. తుఫానులు, వరదలు, వేడిగాలులు వంటి తీవ్రమైన వాతావరణాలకి 80% భారతీయులు ఎఫెక్ట్ అవుతున్నారు.
ఒక నివేదక ప్రకారం, ఈ వాతావరణం మార్పుల వల్ల దుర్బల జిల్లాల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు 25% ఎక్కువగా ఉన్నారు. ఆరోగ్య సేవలు పొందడంలో సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గర్భిణీ మహిళలు, చిన్నపిల్లలు తక్కువ పోషకాహారం పొందే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా శిశు ఆరోగ్య సమస్యలు (అవసరమైన పోషణ లేకపోవడం, బరువు తగ్గడం) పెరుగుతున్నాయి. పెరుగుతున్న వాతావరణ ప్రమాదాల నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థను వాతావరణ మార్పులకు అనుకూలంగా మార్చడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుర్బల జిల్లాల్లో ఆరోగ్య సేవలు అందేలా చూడాలని సూచిస్తున్నారు. పిల్లలు, గర్భిణీ మహిళలకు ప్రత్యేక పోషణ ఇవ్వాలని చెబుతున్నారు.
పిల్లలకు పోషణ
పిల్లలు తక్కువ బరువు ఉంటే వారికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. దీనివల్ల ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గడం, కండరాల బలహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల పిల్లలు, గర్భిణీ స్త్రీలకు వారి శారీరక ఎదుగుదల, ఆరోగ్యానికి ప్రత్యేక పోషణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి పునాది వేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలేట్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం అవసరం. పిల్లల పెరుగుదలకు ముఖ్యంగా పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాలు వచ్చే వరకు పోషకాహారం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(Note: ఇందులోని సమాచానం ఇంటర్నెట్ ఆధారంగా అందించడం జరిగింది.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
ఫ్రిజ్‌లో పెట్టిన పిండితో రోటీ చేసి తింటే ఏమవుతుందో తెలుసా?
ఈ విలువైన వాటిని జీవితంలో ఎప్పటికీ తిరిగి పొందలేరు.!
For More Latest News