Share News

Diabetes: ఈ పాలు చాలా స్పెషల్.. డయాబెటిస్‌కి చెక్ పెట్టాలంటే మీ డైట్‌లో రోజుకు..

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:45 PM

మధుమేహాన్ని నియంత్రించాలంటే ఈ ప్రత్యేకమైన పాలు చాలా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, డయాబెటిస్‌కి చెక్ పెట్టే పాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Diabetes: ఈ పాలు చాలా స్పెషల్.. డయాబెటిస్‌కి చెక్ పెట్టాలంటే మీ డైట్‌లో రోజుకు..
Camel milk

Camel Milk: ప్రస్తుత కాలంలో మధుమేహం బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి దశలవారీగా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా కళ్ళు, మూత్రపిండాలు, గుండె వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలంగా నియంత్రణలో లేకపోతే, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే సరైన జీవనశైలి, ఆహార నియమాలు చాలా ముఖ్యం. అయితే, డయాబెటిస్ ఉన్నవారికి ఒంటె పాలు మంచిదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


ఒంటెలు ఎక్కువగా గల్ఫ్ దేశాలలో ఉండే జంతువులు. అక్కడ ఈ పాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఇది అంతగా ప్రాచుర్యం పొందకపోయినా, దీని ఆరోగ్య ప్రయోజనాలు విశేషమైనవే. శాస్త్రీయ పరిశోధనలు స్పష్టంగా చూపుతున్న విషయమేమిటంటే.. ఒంటె పాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ పాలల్లో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహకరిస్తాయి. వాస్తవానికి, 4 కప్పుల ఒంటె పాలు తీసుకుంటే దాని ప్రభావం సుమారు 50 యూనిట్ల ఇన్సులిన్‌కు సమానంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.


ఒంటె పాలలో ఉండే పోషక విలువలు:

ఒంటె పాలు పోషకాల గని. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యునోగ్లోబులిన్లు ఉంటాయి. అలాగే, ఇది ఇతర రకాల పాలతో పోలిస్తే తక్కువ కొవ్వు, చక్కెర కలిగి ఉంటుంది. 

ప్రయోజనాలు

  • రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది.

  • అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

  • శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • శరీర నొప్పులు, వాపులు తగ్గుతాయి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, రోజుకు 500 మిల్లీలీటర్ల ఒంటె పాలు తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు. మధుమేహం ఉన్నవారు జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. ఆహారంలో ఒంటె పాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..

టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..

For More Health News

Updated Date - Jun 25 , 2025 | 01:51 PM