Walking Reduces Depression: రోజుకు 7 వేల అడుగులతో ఆరోగ్యం మరింత పదిలం
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:06 AM
రోజుకు రెండు వేలు కాదు... 7,000 అడుగులు వేయండి. మీ గుండె మాత్రమే కాదు.

గుండె జబ్బు నుంచే కాదు డిమెన్షియా, డిప్రెషన్ నుంచీ రక్షణ
న్యూఢిల్లీ, జూలై 24: రోజుకు రెండు వేలు కాదు... 7,000 అడుగులు వేయండి. మీ గుండె మాత్రమే కాదు... మీ మానసిక ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది అంటూ ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ పాత్రిక ఓ విశ్లేషణాత్మక వ్యాసాన్ని ప్రచురించింది. సిడ్నీ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాలోని ఇతర సంస్థలు, యూకే, స్పెయిన్, నార్వేకు చెందిన పరిశోధకుల బృందం ఈ వ్యాసాన్ని ప్రచురించింది. కేవలం గుండె సంబంధిత సమస్యలపై మాత్రమే కాకుండా మానవ ఆరోగ్య అంశాలన్నింటిపైనా దృష్టి పెడుతూ 1.6 లక్షల మందిపై పరిశోధనలు చేసి 2014-25 మధ్య కాలంలో ప్రచురించిన 88 పరిశోధనా పత్రాలను ఈ బృందం విశ్లేషించింది. నిత్య జీవితంలో అంత చురుకుగా లేని వయోజనులు ఆరోగ్యం కోసం రోజుకు 10 వేల అడుగులు వేయాలని ఒక అనధికారిక సమాచారం ప్రచారంలో ఉంది. కనీసం రెండు వేల అడుగులు వేయాలని గతంలో కొన్ని పరిశోధనలు చెప్పాయి. రోజుకు 7 వేల అడుగులు అన్నది మరింత ఆచరణాత్మకం, ఆరోగ్యకరం అని తాజా వ్యాసం పేర్కొంది. మరణకారక అనారోగ్యాన్ని 47ు తగ్గిస్తుందని, గుండె జబ్బు వచ్చే అవకాశాలను 25 శాతం, గుండె జబ్బుతో మరణించే అవకాశాలను 47ు తగ్గిస్తుందని వ్యాసం పేర్కొంది. క్యాన్సర్ కారక మరణ ప్రమాదాన్ని 34 శాతం, టైప్ 2 మధుమేహం వ్యాధి వచ్చే అవకాశాన్ని 14ు తగ్గిస్తుందని వివరించింది. నిత్యం వేసే ఏడు వేల అడుగులు... చిత్తవైకల్యం(డిమెన్షియా) కలిగే అవకాశాన్ని 38 శాతం, మానసిక కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలను 22 శాతం తగ్గిస్తుందని పరిశోధకుల బృందం వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News