PM Modi: ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:25 PM
మహాగఠ్‌బంధన్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బయటపెట్టిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత కృషిని ప్రధాని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధిని ఎన్డీయే కొనసాగిస్తుందని, యువకులు, మహిళల బంగారు భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్డీయే నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. ఎన్డీయే చేసిన ప్రజాసేవకు పట్టంకడుతూ ప్రజలు రీసౌండింగ్ తీర్పునిచ్చారని ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వరుస పోస్టులు పెట్టారు.
మహాగఠ్‌బంధన్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత కృషిని ప్రధాని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధిని ఎన్డీయే కొనసాగిస్తుందని.. యువకులు, మహిళల బంగారు భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
'సుపరిపాలన విజయం సాధించింది. అభివృద్ధికి గెలుపు వరించింది. ప్రజాసంక్షేమ స్ఫూర్తి విజయం సొంతం చేసుకుంది. సామాజిక న్యాయం గెలిచింది' అని మోదీ అన్నారు. ఎన్డీయేను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో బిహార్ మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేక గౌరవం కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు చురుకుగా పనిచేస్తామని చెప్పారు. నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితిన్ రామ్ మాంఝీ, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహకు ప్రధాని అభినందనలు తెలిపారు.
రికార్డు సృష్టించిన ఎన్డీయే
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 243 స్థానాల్లో 200కు పైగా స్థానాలు సాధించి తిరిగి అధికారం నిలుపుకోగా, బీజేపీ 95 శాతం స్ట్రైక్ రేట్‌తో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ఇవీ చదవండి:
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
అమిత్ షా చెప్పింది నిజమే.. బీహార్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యం 180 ప్లస్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..