Share News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ గెలుపుతో జోష్.. స్పీడ్ పెంచనున్న సీఎం

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:47 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైంది. పోస్టల్ బ్యాలెట్ మొదలు.. రౌండ్ రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ గెలుపుతో రేవంత్ వ్యూహం ఫలించినట్లైంది.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ గెలుపుతో జోష్.. స్పీడ్ పెంచనున్న సీఎం
Jubilee Hills Bypoll

హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి చివరి వారం వరకు కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెన్స్ కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ చివరి వారంలో ఏం చేయాలో దిశానిర్దేశం చేయడంతో పాటు.. స్వయంగా ప్రచారం చేయడం హస్తం నేతల్లో జోష్‌ను నింపింది. పోల్ మేనేజ్మెంట్‌పై బూత్ ఏజెంట్లకు, బూత్ ఇంచార్జీలకు సీఎం సందేశం ఇచ్చారు. మొత్తానికి తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు రేవంత్ గెలుపుతో సమాధానం చెప్పారు. జూబ్లీహిల్స్ గెలుపుతో ముఖ్యమంత్రి మరింత స్ట్రాంగ్‌గా నిలవనున్నారు. ఇకపై సీఎం రేవంత్ గేరు మార్చి స్పీడ్ పెంచనున్నారు.


మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కనపబరచగా.. ఆ తరువాత ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. రౌండ్‌ రౌండ్‌కు కాంగ్రెస్ లీడ్ పెరుగుతూ వస్తోంది. మొదటి రౌండ్ - 47, రౌండవ రౌండ్‌లో 2995, మూడవ రౌండ్‌లో 2843, నాల్గవ రౌండ్‌లో 3547 ఓట్లు ఇలా ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. చివరకు ఏడో రౌండ్ ముగిసిన తర్వాత 19 వేలకు ఓట్లకు పైగా స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.


ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయమవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టపాసులు పేలుస్తూ, డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి ఉప ఎన్నికల ఫలితాలను మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర ముఖ్య నేతలు సమీక్షిస్తున్నారు. ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ వస్తుండడంతో మంత్రులు , ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్

చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 06:17 PM