Share News

Jubilee Hills: ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. మూడంచెల బందోబస్తు..

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:26 PM

నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Jubilee Hills: ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. మూడంచెల బందోబస్తు..
Jubilee Hills By Election

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. రేపు(సోమవారం) రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని పేర్కొన్నారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బూత్‌ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. 45FST, 45SST టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.


పోలింగ్ కేంద్రాల్లో 2,060 మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారని కర్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్‌ ఉంటుందని చెప్పారు. అలాగే.. పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఓటర్లు క్యూ మెయింటెన్ చేయడానికి NCC వాలంటీర్లు కూడా పని చేయనున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా.. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామని వెల్లడించారు.


ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే అంశంపై RBIతో చర్చించినట్లు కర్ణన్ తెలిపారు. ఈ మేరకు ఆన్‌లైన్ పేమెంట్స్‌‌పై RBI నిఘా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే.. నేటి నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలని కర్ణన్ విజ్ఞప్తి చేశారు.


అనంతరం జాయింట్ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్ మాట్లాడుతూ.. 65 లొకేషన్స్‌లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించినట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాల బందోబస్తు ఉంటుందన్నారు. అలాగే.. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు. 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో

హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్

Updated Date - Nov 09 , 2025 | 06:40 PM