Amit Shah: 15 ఏళ్ల పాలనతో 50 ఏళ్లు వెనక్కి నెట్టేశారు
ABN , Publish Date - Oct 17 , 2025 | 08:30 PM
బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం నాడు జరిగిన మేథావుల సదస్సులో అమిత్‌షా మాట్లాడుతూ, ఆర్జేడీ ఆటవిక పాలనతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బిహార్‌లో ఏర్పాటు చేసిన పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోయాయని చెప్పారు.
పాట్నా: ఆర్జేడీ (RJD) సుప్రీం లాలూప్రసాద్ (Lalu Prasada) హయాంలో బిహార్‌లో 15 ఏళ్ల పాటు 'ఆటవిక రాజ్యం' సాగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. దీంతో రాష్ట్రం అర్ధశతాబ్దం వెనక్కి వెళ్లిపోయిందని, ఆ సమయంలో బిహార్ గౌరవం, వైభవం, ప్రతిభ వంటివన్నీ కోల్పోయాయని తెలిపారు. ఇప్పుడు ఇదే 'జంగిల్ రాజ్' కొత్త ముఖాలతో ప్రజల ముందుకు వస్తోందని తేజస్వి యాదవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం నాడు జరిగిన మేథావుల సదస్సులో అమిత్‌షా మాట్లాడుతూ, ఆర్జేడీ ఆటవిక పాలనతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బిహార్‌లో ఏర్పాటు చేసిన పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోయాయని చెప్పారు. అవినీతి కేసులో జైలు నుంచి లాలూ ప్రసాద్ వచ్చినప్పుడు ఏనుగుపై ఊరేగింపు జరిపారని, ఇదెంత సిగ్గుచేటు వ్యవహారమో మనం ఊహించలేమని అన్నారు.
అప్పుడు 6 విడతలు.. ఇప్పుడు 2 విడతలు..
బిహార్‌లో అప్పట్లో మీరు 6 విడతల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం లాలూ, రాహుల్ కంపెనీకి గుర్తుందా? అని అమిత్‌షా ప్రశ్నించారు. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఆర్జేడీ హయాంలో 6 విడతల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని, బిహార్ ఇప్పుడు సురక్షితంగా ఉన్నందునే కేవలం రెండు విడతల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా, 243మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత... ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే
ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసా.. సిద్ధరామయ్య మండిపాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి