Share News

UPSC Results 2025: సివిల్స్‌ ఫలితాలొచ్చేశాయ్.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..

ABN , Publish Date - Apr 22 , 2025 | 02:58 PM

UPSC Results 2025: యూపీఎస్సీ సివిల్స్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారులు మంగళవారం నాడు సివిల్స్ ఫలితాలను విడుదల చేశారు. 1009 మంది అభ్యర్థులు సివిల్స్‌కు..

UPSC Results 2025: సివిల్స్‌ ఫలితాలొచ్చేశాయ్.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..
UPSC Results 2025

UPSC Results 2025: యూపీఎస్సీ సివిల్స్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారులు మంగళవారం నాడు సివిల్స్ ఫలితాలను విడుదల చేశారు. 1009 మంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపికయ్యారు. జనరల్ కోటలో 335 మంది అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ కోటలో 109 మంది అభ్యర్థులు, ఓబీసీ కోటాలో 318 మంది అభ్యర్థులు, ఎస్సీలు 160, ఎస్టీలు 87 చొప్పున మొత్తం 1009 మంది అభ్యర్థులు సివిల్స్‌కి ఎంపికయ్యారు.


యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో శక్తి దూబే మొదటి ర్యాంక్ సాధించారు. హర్షకి గోయ్ రెండో ర్యాంక్ సాధించారు. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ 4, ఆకాష్ గార్గ్ 5, కోమల్ పూనియా 6, ఆయుషి బన్సల్ 7, రాజ్ కృష్ణ ఝా 8, ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌ 9, మయాంక్‌ త్రిపాఠి 10వ ర్యాంకు సాధించారు.

సివిల్స్‌లో తెలుగు వారి హవా..

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు అభ్యర్థి సాయి శివానికి 11వ ర్యాంక్ వచ్చింది. బన్న వెంకటేష్ 15వ ర్యాంక్, రావుల జై సింహ రెడ్డి 46 వ ర్యాంక్ సాధించారు. అలాగే శ్రవణ్‌కుమార్‌ రెడ్డి-62, సాయి చైతన్య జాదవ్‌ 68వ ర్యాంకు, చేతన రెడ్డి-110, శివ గణేష్‌ రెడ్డి-119, శ్రీకాంత్‌ రెడ్డి-151వ ర్యాంక్ సాధించారు.


యూపీఎస్సీ సివిల్స్‌కి సెలక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు కింద చూడొచ్చు..

UPSC 1.jpgUPSC 2.jpgUPSC 3.jpgUPSC 4.jpg


Also Read:

కాలేజీ లెక్చరర్‌పై విద్యార్థిని చెప్పు దాడి

తప్పు చేస్తే వదలం.. హెంమంత్రి అనిత మాస్

వామ్మో.. ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.3.5 లక్షల స్టైఫెండ్

For More Education News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 03:28 PM