UPSC 2026 Calendar: ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్.. ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..
ABN , Publish Date - May 15 , 2025 | 02:41 PM
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026లో జరగనున్న పరీక్షల క్యాలెండర్‌ను (UPSC 2026 Calendar) తాజాగా విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 2026కు సంబంధించి నియామక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల (UPSC 2026 Calendar) చేసింది. దీని ప్రకారం, UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 నోటిఫికేషన్ జనవరి 14, 2026న విడుదల కానుంది. ఫిబ్రవరి 3 వరకూ అప్లై చేసుకోవచ్చు. UPSC CSE ప్రిలిమ్స్ పరీక్ష మే 24న జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21, 2026న జరగనుంది. UPSC NDA-I, CDS-I రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ డిసెంబర్ 10, 2025న విడుదల కానుంది. ఈ రెండింటికీ రాత పరీక్ష ఏప్రిల్ 12, 2026న జరుగుతుంది.
ఇతర ముఖ్యమైన నియామక పరీక్షలు, వాటి తేదీల గురించి ఇక్కడ చూద్దాం
కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) 2026 పరీక్ష నోటిఫికేషన్ 03.09.2025న విడుదల చేయనున్నారు. దరఖాస్తులను 23.09.2025 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 08.02.2026న జరుగుతుంది.
ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2026 నోటిఫికేషన్ 17.09.2025న విడుదల కానుంది. దీనికి 07.10.2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ 08.02.2026న జరుగుతుంది.
CBI (DSP) LDCE నోటిఫికేషన్ 24.12.2025న రానుంది. మీరు 13.01.2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష 28.02.2026న జరుగుతుంది.
CISF AC(EXE) LDCE-2026 నోటిఫికేషన్ 03.12.2025న వస్తుంది. దరఖాస్తులను 23.12.2025 వరకు అప్లై చేయవచ్చు. పరీక్ష 08.03.2026న జరుగుతుంది.
ఎన్డీఏ N.A. పరీక్ష (I), 2026 నోటిఫికేషన్ 10.12.2025న విడుదల చేస్తారు. మీరు దీని కోసం 30.12.2025 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 12.04.2026న జరుగుతుంది.
CDS 2026 నోటిఫికేషన్ 10.12.2025న విడుదల చేస్తారు. మీరు దీని కోసం 30.12.2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ 12.04.2026న జరగనుంది.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2026 నోటిఫికేషన్ 14.01.2026న విడుదల చేస్తారు. దరఖాస్తులను 03.02.2026 వరకు తీసుకుంటారు. పరీక్ష 24.05.2026న జరుగుతుంది.
2026 పరీక్షకు సంబంధించిన IES/ISS నోటిఫికేషన్ 11.02.2026న రానుంది. దరఖాస్తులను 03.03.2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ 19.06.2026న జరగనుంది.
ఇంజనీరింగ్ సర్వీసెస్ 2026 మెయిన్స్ ఎగ్జామ్ 21.06.2026న జరగనుంది.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్) 2026 నోటిఫికేషన్ 18.02.2026న విడుదల చేస్తారు. మీరు 10.03.2026 వరకు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 19.07.2026న జరుగుతుంది.
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 కోసం నోటిఫికేషన్ 11.03.2026న విడుదల అవుతుంది దరఖాస్తులను 31.03.2026 వరకు స్వీకరిస్తారు. పరీక్ష 02.08.2026న జరుగుతుంది.
సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2026 పరీక్ష, 21.08.2026న జరుగనుంది.
ఎన్డీఏ. N.A. పరీక్ష (II) 2026 నోటిఫికేషన్ 20.05.2026న విడుదల చేస్తారు. 09.06.2026 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. పరీక్ష 13.09.2026న జరుగుతుంది.
పరీక్ష (II) 2026 కోసం CDS నోటిఫికేషన్ 20.05.2026న విడుదల అవుతుంది. 09.06.2026 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 13.09.2026న జరుగుతుంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 మెయిన్స్ పరీక్ష, నవంబర్ 22, 2026న జరుగుతుంది
SO/స్టెనో (GD-B/GD-I) LDCE నోటిఫికేషన్ 16.09.2026న రానుంది. మీరు దీని కోసం 06.10.2026 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 12.12.2026న జరుగుతుంది.
Also Read:
గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
For More Andhra Pradesh News and Telugu News..