Share News

SBI PO Notification 2025: ఎస్బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం, అప్లై చేశారా లేదా

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:56 PM

మీరు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నారా. బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. అయితే ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఎస్బీఐ నుంచి ఇటీవల పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ (SBI PO Notification 2025) విడుదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

SBI PO Notification 2025: ఎస్బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం, అప్లై చేశారా లేదా
SBI PO Notification 2025

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి 541 ప్రొబేషనరీ ఆఫీసర్ (SBI PO Notification 2025) పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు చివరి తేదీ జూలై 14, 2025 వరకు ఉంది. అయితే వీటి కోసం అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, నెలకు ఎంత జీతం వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


అర్హత

వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రం నుంచి అయినా, అర్హత ఉన్న ఏ అభ్యర్థి అయినా ఈ SBI బ్యాంకింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 541 ఖాళీలలో రెగ్యులర్, బ్యాక్‌లాగ్ స్థాయి పోస్టులు రెండూ ఉన్నాయి. వీటికోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 24, 2025 నుంచి ప్రారంభమైంది.


వయో పరిమితి

21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. వయస్సును 2025 ఏప్రిల్ 1 నుంచి లెక్కిస్తారు. అంటే, అభ్యర్థి 1995 ఏప్రిల్ 2కి ముందు, 2004 ఏప్రిల్ 1 తర్వాత జన్మించి ఉండకూడదు. SC, STలకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. OBCలకు అయితే 3 సంవత్సరాలు సడలింపు ఇస్తారు.

ఎంపిక పరీక్ష

మొదట ప్రిలిమ్స్, ఆ తర్వాత మెయిన్స్, సైకో మెట్రిక్ టెస్ట్ (గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ) ఉంటాయి. ప్రిలిమ్స్‌లో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మూడో దశ సైకో మెట్రిక్ టెస్ట్‌కు పిలుస్తారు.


దరఖాస్తు రుసుము

జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.750, SC, ST, దివ్యాంగులకు అయితే ఎలాంటి రుసుము ఉండదు.

SBI PO రిక్రూట్‌మెంట్ కోసం ముఖ్యమైన తేదీలు

  • అభ్యర్థుల దరఖాస్తులో సవరణ/మార్పుతో సహా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 24.06.2025 నుంచి 14.07.2025 వరకు

  • దరఖాస్తు రుసుము చెల్లింపు 24.06.2025 నుంచి 14.07.2025 వరకు

  • జూలై 2025 3వ/4వ వారంలో ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్

  • ఫేజ్-I: ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష జూలై/ఆగస్టు 2025

  • ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన ఆగస్టు/సెప్టెంబర్ 2025

  • మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ ఆగస్టు/సెప్టెంబర్ 2025

  • ఫేజ్-II: ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 2025

  • మెయిన్స్ పరీక్ష ఫలితాల ప్రకటన సెప్టెంబర్/అక్టోబర్ 2025

  • ఫేజ్-III కాల్ లెటర్ డౌన్‌లోడ్ అక్టోబర్/నవంబర్ 2025

  • ఫేజ్-III: సైకో మెట్రిక్ పరీక్ష అక్టోబర్/నవంబర్ 2025

  • ఇంటర్వ్యూ - అక్టోబర్/నవంబర్ 2025

  • తుది ఫలితాల ప్రకటన - నవంబర్/డిసెంబర్ 2025


జీతం ఎంత..

ఇక జీతం విషయానికి వస్తే నెలకు ప్రాథమిక వేతనం రూ. 48,480 లభిస్తుంది. (4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్‌లతో) స్కేల్ 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920. వేతనంతో పాటు ఉన్న సౌకర్యాలలో డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ (CCA), మెడికల్ ఫెసిలిటీ, లీజు రెంటల్ ఫెసిలిటీ, NPS, లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC), ఇతర అలవెన్సులు లభిస్తాయి.


ఇవీ చదవండి:

కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 03:56 PM