GD Constable key- 2025: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష రాశారా.. అయితే ఆన్సర్ కీ కోసం ఇలా చేయండి..
ABN , Publish Date - Feb 27 , 2025 | 10:05 AM
ఎస్ఎస్‌సీ విడుదల చేసే జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం కీని చూసేందుకు అభ్యర్థులు ముందుగా ssc.gov.in. వెబ్ సైట్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీలో ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అని ఉన్న లింక్‌ను వెతకండి.

ఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ (GD Constable) జవాబు కీని విడుదల చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 25 వరకూ దేశవ్యాప్తంగా జీడీ కానిస్టేబుల్ పరీక్షలను ఎస్ఎస్‌సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో పదో తరగతి అర్హతతో 39,481 పోస్టులకు ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ కొలువు పొందేందుకు పరీక్షలు రాసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాగా, ఈ పరీక్షలకు సంబంధించిన జావాబు కీ విడుదల చేసేందుకు ఎస్ఎస్‌సీ సిద్ధమైంది. అయితే జవాబు కీని ఎలా చూసుకోవాలి, డౌన్‌లోడ్ చేయాలి? వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్సర్ కీ- ఇలా చేయండి..
ఎస్ఎస్‌సీ విడుదల చేసే జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం కీని చూసేందుకు అభ్యర్థులు ముందుగా ssc.gov.in. వెబ్ సైట్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీలో ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అని ఉన్న లింక్‌ను వెతకండి. అనంతరం దానిపై క్లిక్ చేసి అవసరమైన లాగిన్ వివరాలను ఇవ్వండి. ఆ తర్వాత స్క్రీన్‌పై ఎస్ఎస్‌సీ జీడీ ఆన్సర్ కీ- 2025 అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పీడీఎఫ్ ఓపెన్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేసుకోవడం చేయవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని మీ వద్ద జాగ్రత్తగా దాచుకోండి. ఒకవేళ ఆన్సర్ కీపై మీకేమైనా అసంతృప్తి ఉంటే నిర్ణీత సమయం లోగా అభ్యంతరాలను తెలియజేయవచ్చు. మీ అభ్యర్థనను స్వీకరించి అధికారులు దాన్ని పరిశీలిస్తారు. మీరు లేవనెత్తిన ప్రశ్నలు సరైనవే అని తేలితే దానికి తగిన మార్కులను యాడ్ చేసి సవరించిన తుది ఆన్సర్ కీని మళ్లీ జారీ చేస్తారు.
కాగా, ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్షల ద్వారా ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్లు వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సద్గురు డ్యాన్స్‌కి ఫిదా అయిన జర్మనీ అమ్మాయి..
Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..