Share News

Manasa Sarovar Yatra: జూన్ నుంచి కైలాస మానస సరోవర యాత్ర.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:18 PM

Manasa Sarovar Yatra: కైలాస్ మానస సరోవర యాత్రపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. యాత్రికులు ఎప్పటి నుంచో ఈ యాత్రకోసం ఎదురుచూస్తున్నారు. ఈ యాత్రలో సరైన భద్రత చర్యలు చేపట్టాలని సూచించిది.

Manasa Sarovar Yatra: జూన్ నుంచి కైలాస మానస సరోవర యాత్ర.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
Manasa Sarovar Yatra

ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కైలాస్ మానస సరోవర యాత్ర 2025 జూన్ నుంచి ఆగష్టు వరకు జరుగనుంది. ఈ సంవత్సరం, ప్రతి బ్యాచ్‌లో 50 యాత్రికులు ఉండేలా 5, 10 మందితో బ్యాచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇవాళ (శనివారం) కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యాత్రికులు ఉత్తరాఖండ్ రాష్ట్రం ద్వారా లిపులేఖ్ పాస్ దాటి, అలాగే సిక్కిం రాష్ట్రం ద్వారా నాథులా పాస్ దాటి ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ kmy.gov.in వెబ్‌సైట్‌ ప్రారంభించింది.


యాత్రికులను, న్యాయమైన, కంప్యూటర్ ఆధారిత, లింగ సమతుల్య ప్రక్రియ ద్వారా దరఖాస్తుదారుల నుంచి ఎంపిక చేస్తారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అభ్యర్థుల సమాచారం కోసం లేఖలు లేదా ఫ్యాక్స్‌లు పంపాల్సిన అవసరం లేదని పేర్కొంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫీడ్‌బ్యాక్ ఎంపికల ద్వారా సమాచారం పొందడం, అభిప్రాయాలను నమోదు చేయడం లేదా అభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం చేయవచ్చని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

Shiva Essence: ఆ తత్త్వం ఊహాతీతం

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Shiva Linga Mystery: శివలింగ మర్మం

Updated Date - Apr 26 , 2025 | 03:27 PM