Share News

Sravana Masam 2025: శుభకర మాసం.. శ్రావణం

ABN , Publish Date - Jul 21 , 2025 | 08:13 PM

మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శుభ కార్యాల మాసం కావడంతో.. మహిళలంతా అమ్మవారి దేవాలయాలకు పోటెత్తుతారు. ఈ మాసంలో పర్వదినాలు సైతం అధికంగానే ఉంటాయి.

Sravana Masam 2025: శుభకర మాసం.. శ్రావణం

ఏడాదిలో 12 నెలలు ఉన్నా.. శుభకరమైన మాసం ఏదంటే మాత్రం ఎవరైనా శ్రావణ మాసమని చెబుతారు. శ్రావణ మాసం అంటేనే.. పూజలు, వ్రతాలు, వివాహాలు, వేడుకలు తదితర శుభ కార్యాలు నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా అమ్మవారి ఆలయాలకు మహిళలు పోటెత్తుతారు. అదీకాక ఈ మాసంలో శుభ ముహూర్తాలు భారీగా ఉండడంతో.. వివాహా వేడుకల ద్వారా పలు జంటలు పెళ్లి పీటలు ఎక్కనున్నాయి.


2025, జులై 26వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో పర్వదినాలు

  • 29వ తేదీ నాగ పంచమి.

  • ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం

  • 9వ తేదీ రాఖీ పౌర్ణమి.

  • 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం

  • 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి

  • 23వ తేదీ పోలాల అమావాస్య.. ఈ రోజుతో శ్రావణ మాసం ముగియనుంది.


ఇక ఈ మాసంలో శుభ ముహూర్తాల తేదీలివే..

ఈ మాసంలో జులై 26, 30, 31 తేదీలతోపాటు ఆగస్టులో.. 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు.


శ్రీకృష్ణ జన్మాష్టమి..

అష్టమ తిథి ఆగస్టు 15వ తేదీ రాత్రి 11.49 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే సూర్యోదాయం అనంతరం తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ పండగను ఆగస్టు 16వ తేదీన జరుపుకోనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ.300 టిక్కెట్ లభించకపోతే ఇలా ట్రై చేయండి!

ఈ రాశి వారికి లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది

For More Devotional News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 08:14 PM