Peddamma Temple: పెద్దమ్మ ఆలయం... ఆధ్యాత్మిక వైభవం
ABN , Publish Date - Jul 05 , 2025 | 08:09 AM
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం(Jubilee Hills Peddamma Thalli Temple)లో మూడు రోజులుగా జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.

- ముగిసిన శాకాంబరి ఉత్సవాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం(Jubilee Hills Peddamma Thalli Temple)లో మూడు రోజులుగా జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించిన అనంతరం కూరగాయలతో అలంకరించారు. సాయంత్రం కూరగాయలను భక్తులకు పంపిణీ చేశారు. పల్లకీ సేవ అనంతరం బాణసంచా వెలుగుల్లో ఆలయం ధగధగలాడింది.
బంగారు బోనం సమర్పణ..
చాంద్రాయణగుట్ట: సప్త మాతృకులకు సప్త బంగారు బోనంలో భాగంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు జి.రాఘవేందర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఆలయానికి వెళ్లి పెద్దమ్మతల్లికి బంగారు బోనం, పట్టు వస్ర్తాలు సమర్పించారు. జోగిని అవికాదేవి నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా బోనాన్ని తీసుకొచ్చారు. వివిధ దేవాలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News