Mahashivratri 2025: మహా శివరాత్రి స్పెషల్.. ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:38 PM
Numerology Mahashivratri: శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఏయే తేదీల్లో పుట్టిన వారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

హిందూ పండుగల్లో కొన్ని సరదా, సంతోషాలతో నిండి ఉంటాయి. మరికొన్ని మాత్రం కఠినమైన నియమాలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సి ఉంటుంది. ఏ పండుగకైనా భక్తిశ్రద్ధలు అనేవి తప్పనిసరి. కానీ కొన్ని ఫెస్టివల్స్‌కు మాత్రం నియమాలు కఠినంగా ఉంటాయి. అందులో మహా శివరాత్రి ఒకటని చెప్పొచ్చు. ఉపవాసాలు, జాగారాలతో మనసంతా మహాదేవుడిపై లగ్నం చేసి జరుపుకునే పండుగ ఇది. మహా శివరాత్రి నేపథ్యంలో ఈ ఏడాది పరమేశ్వరుడి అనుగ్రం ఎవరిపై ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
వాళ్లకు ఢోకా లేదు
భక్తులందరి మీద శివానుగ్రహం ఒకేలా ఉంటుంది. తనను నమ్మిన వారికి, నిండు మనసుతో కొలిచిన వారికి సదాశివుడు ఎల్లవేళలా అండగా ఉంటాడు. అయితే 2025లో కొందరు భక్తులకు మహాదేవుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని న్యూమరాలజీ నిపుణలు అంటున్నారు. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారిపై ఈసారి శివానుగ్రహం పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. శివరాత్రి తర్వాత వీరి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని.. బాధ్యతలు పెరగడమే గాక భవిష్యత్తుకు ఢోకా ఉండదని అంటున్నారు. వీళ్ల ఆరోగ్యం మెరుగుపడటమే గాక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతున్నారు.
ఆర్థికంగా ఢోకా ఉండదు
పైతేదీల్లో పుట్టిన వారే గాక ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికీ ఈ శివరాత్రి ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు న్యూమరాలజీ నిపుణులు. వీళ్లకు ఉద్యోగావకాశాలు పెరగడమే గాక జాబ్స్ విషయంలో కొత్త దారులు తెరుచుకుంటాయట. ఆత్మ విశాసం ఇనుమడిస్తుందట. ఆర్థికంగానూ వీళ్లకు ఢోకా ఉండదని, ధనార్జన విషయంలో తిరుగుండదని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికీ ఈసారి శివానుగ్రహం అధికంగా ఉంటుందని అంటున్నారు. శివుడి కృప వల్ల అనుకున్న లక్ష్యాలను వీరు త్వరగా చేరుకుంటారని చెబుతున్నారు. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారని, నిత్యం ఉత్సాహంగా ఉంటూ అన్ని పనులు చక్కబెడతారని నిపుణులు అంటున్నారు.
ఇవీ చదవండి:
ఈ వారం వాహనాలు నడపడంలో జాగ్రత్త..
మరిన్ని ఆధ్యాత్మిక, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి