Chennai News: విఘ్నేశ్వరుడికి గజరాజు పూజలు...
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:28 PM
అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి.
చెన్నై: అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్(Eeroad) జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి. ఆహారం, నీటి కోసం జంతువులు తరచూ జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి.

ఈ నేపథ్యంలో, అడవి నుంచి బయటకు వచ్చిన ఏనుగు(Elephant) వినాయకుడి ఆలయం వద్ద తొండెం ఎత్తి వంగి ఉన్న దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. బన్నారి మారియమ్మన్ ఆలయం పక్కనే తింబం పర్వత మార్గం ఉంది. ఈ మార్గంలో ఉన్న వినాయకుడి ఆలయానికి రెండు రోజుల క్రితం వచ్చిన లారీ డ్రైవర్, లారీని పక్కనే ఆపి, ఆలయంలో కొబ్బరి కాయ కొట్టి, కర్పూరం వెలిగించి పూజలు చేశాడు.

అనంతరం కొద్దిదూరం వెళ్లి ఓ చెట్టు కింద సేదతీరాడు. ఆ సమయంలో, అడవి నుంచి వచ్చిన ఏనుగును చూపి డ్రైవర్ భయపడ్డాడు. కానీ ఆ ఏనుగు ఆలయం ముందు నిల్చుని తొండెం ఎత్తి కొంచెం వంగి కాసేపు ఉండి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో, ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఏనుగు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News