Share News

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున .. మీ ప్రియమైనవారిని ఇలా సర్‌ ప్రైజ్ చేయండి..

ABN , Publish Date - Apr 30 , 2025 | 10:26 AM

Happy Akshaya Tritiya 2025: ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన ఏ పనులు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని.. ఇవాళ పుణ్యకార్యాలు చేస్తే దైవానుగ్రహం జీవితాంతం ఉంటుందని అంటారు. ధనలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టేందుకు ఈ రోజే మంచి సమయమని భక్తుల నమ్మకం.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున .. మీ ప్రియమైనవారిని ఇలా సర్‌ ప్రైజ్ చేయండి..
Happy Akshaya Tritiya 2025

Akshaya Tritiya 2025 Wishes: వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడో రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ అనే పదం నుంచి అక్షయ తృతీయ అనే పదం ఉద్భవించింది. 'ఎన్నటికీ తరిగిపోనిది' అని అర్థం . శుక్ల పక్షంలో తృతీయ రోజున వస్తుంది కాబట్టి తృతీయ. ఈ పండుగ నాడు బంగారం కొంటే భవిష్యత్తులో సంపద, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంకా కొత్త వ్యాపారం, గృహ ప్రవేశం, వివాహం వంటి శుభకార్యాలు, దాతృత్వ కార్యాలూ చేస్తే శుభఫలితాలు దక్కుతాయని అంటారు. ఈ రోజున మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రియమైనవారికి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని మంచి మాటలు, మనసుకు హత్తుకునే వాట్సాప్ సందేశాలు ఇక్కడ ఉన్నాయి.


అక్షయ తృతీయ శుభాకాంక్షలు

  • ఈ అక్షయ తృతీయలో మీ జీవితంలో సంపద, శ్రేయస్సు, తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబసభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు, మీ కుటుంబసభ్యులు సంపద, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి. మీకు, మీ కుటుంబసభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి కరుణలో మీ ప్రార్థనలన్నీ ఫలించాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు, మీ కుటుంబసభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ అక్షయ తృతీయ మీ కుటుంబంలో ఐశ్వర్యం, ప్రేమ, సంతోషాలు తీసుకురావాలి. మీకు, మీ కుటుంబసభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • ఈ అక్షయ తృతీయ మీకు జీవితంలో అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబసభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • ఈ శుభదినం మీకు కొత్త ఆలోచనలు, ఆశయాలకు ప్రేరణనివ్వాలి. మిమ్మల్ని విజేతలుగా నిలపాలి. మీకు, మీ కుటుంబసభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • ఈ అక్షయ తృతీయ రోజు మీ జీవితం సంతోషాల తారకమై ప్రకాశించాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాల వర్షం మీ జీవితంలో కురవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • శుభదినంగా వెలుగుతున్న ఈ రోజు మీ ఇంటికి శాంతి తీసుకురావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • మీరు కోరుకున్న ఏ ఆశయమైనా ఈ అక్షయ తృతీయ సందర్భంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయపథంలో నడవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • మీ జీవితం ప్రేమతో, ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

  • ఈ శుభదినం మీ ఇంటికి దైవ అనుగ్రహాన్ని, కొత్త అవకాశాలను తీసుకురావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.


Read Also: Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశం

Simhachalam: చందనోత్సవానికి సర్వం సిద్ధం

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు..

Updated Date - Apr 30 , 2025 | 10:30 AM