Hyderabad: యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. ఏం చేశాడో తెలిస్తే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:15 AM
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అశ్లీల ఫొటోలు పంపి పెళ్లి చెడగొడతానంటూ వేధింపులకు గురిచేస్తు్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. హెచ్. అకుల్‌సింగ్ అనే వ్యక్తి యువతిని పలు రకాలుగా బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా అతడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

- మార్ఫింగ్ ఫొటోలతో యువతికి వేధింపులు
- డబ్బులు చెల్లించాలని డిమాండ్
- నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి పెళ్లి సంబంధం చెడగొడతానని నకిలీ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి హెచ్. అకుల్‌సింగ్ (24), ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ రూపొందించాడు. నగరానికి చెందిన యువతి (21)కి పెళ్లి నిశ్చయమైంది. ఆ యువతి వివరాలు సేకరించి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. తరచూ చాటింగ్ చేసి యువతి ఫొటోలు సేకరించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉదయం నుంచే భానుడి ప్రతాపం..
వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చి, యువతితోపాటు కాబోయే భర్తకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా అశ్లీల ఫొటోలు పంపి, పెళ్లి రద్దు చేయిస్తానంటూ వేధింపులకు గురిచేశాడు. దాంతో భాదితురాలు నిందితుడు అకుల్ సింగ్‌ను సంప్రదించింది. డబ్బులు ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని చెప్పాడు. మరో స్నేహితుడి సహకారంతో రూ. 6 లక్షలు అకుల్‌సింగ్ సూచించిన ఖాతాలో జమ చేసినట్లు నకిలీ సందేశాలను పంపింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైం ఆధారాలతో నిందితుడు అకుల్ సింగ్‌ను బుధవారం అరెస్ట్ చేసి, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..
Read Latest Telangana News and National News