Hyderabad: సంక్రాంతికి ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:35 PM
ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లోఉన్న బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. పేట్‌బషీరాబాద్(Petbashirabad) పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్దనగర్ పక్కనే ఉన్న విజయహోమ్స్‌లో 10 నంబరు విల్లాలో ఉంటున్న శ్యామల ఉదయ్‌సాయి ప్రసన్న సంక్రాంతి(Sankranti)కి ఈ నెల 12వ తేదీన ఖమ్మం(Khammam) వెళ్లింది.

21 తులాల బంగారం, రూ.5 వేల అపహరణ
హైదరాబాద్: ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లోఉన్న బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. పేట్‌బషీరాబాద్(Petbashirabad) పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్దనగర్ పక్కనే ఉన్న విజయహోమ్స్‌లో 10 నంబరు విల్లాలో ఉంటున్న శ్యామల ఉదయ్‌సాయి ప్రసన్న సంక్రాంతి(Sankranti)కి ఈ నెల 12వ తేదీన ఖమ్మం(Khammam) వెళ్లింది. తిరిగి 15వ తేదీ సాయంత్రానికి బౌద్దనగర్‌కు వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు పగలుకొట్టి, వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: High Court: 66 ఏళ్లు సాగిన ఆస్తి తగాదాపై హైకోర్టు తుది తీర్పు
బీరువాలో ఉంచిన 13 తులాల మ్యాంగో హారం, అయిదు గాజులు, నల్లపూసల గొలుసు, చెవి రింగులు మొత్తం కలిపి 21 తులాల బంగారాన్ని, రూ.5 వేలు నగదును దోచుకెళ్లారు. గురువారం ఇంటి యజమాని ఉదయ్ సాయిప్రసన్న(Uday Sai Prasanna) పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించి, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. విల్లా వెనుక భాగంలో ఉన్న ఖాళీస్థలం నుంచి ప్రహారీ దూకిన దొంగ విల్లాకు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి, ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. గదిలో ఉన్న వెండి వస్తువులను దొంగలు వదిలి వేసి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News