Share News

Hyderabad: భార్య ఆత్మహత్య.. కొన్ని గంటల్లోనే భర్త కూడా..

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:45 AM

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన బాచుపల్లి పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరి దుర్గా శ్రీనివాసులు, వేల్పూరి దుర్గారాణి (22) భార్యాభర్తలు.

Hyderabad: భార్య ఆత్మహత్య.. కొన్ని గంటల్లోనే భర్త కూడా..

- కుటుంబ కలహాలతో దంపతుల బలవన్మరణం

- అనాథలైన పిల్లలు

- బాచుపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో విషాదం

హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన బాచుపల్లి పోలీస్‏స్టేషన్‌(Bachupalli Police Station) పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరి దుర్గా శ్రీనివాసులు, వేల్పూరి దుర్గారాణి (22) భార్యాభర్తలు. 2019లో వీరికి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రగతినగర్‌ సమీపంలోని మిథిలానగర్‌(Mithilanagar)లో గల శాంతివనం అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు.


city1.jpg

కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తాము నివాసముంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని దుర్గారాణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో భార్య మృతి చెందిన కొన్ని గంటల్లోనే భర్త శ్రీనివాసులు కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఇద్దరి ఆత్మహత్యలతో వారి పిల్లలిద్దరూ అనాఽథలుగా మారారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 06:48 AM