Phone Pay: ఫోన్ చోరీ చేసి.. ఫోన్ పే ఉపయోగించి..
ABN , Publish Date - Dec 03 , 2025 | 07:36 AM
సెల్‌ఫోన్ చోరీ చేసి ఫోన్ పే ద్వారా నగదును బదిలీ చేసుకున్న విషయం హైదరాబాద్ నగర శివారులో వెలుగుచూసింది. రాధాకృష్ణారావు అనే మాజీ సర్పంచ్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. అయితే.. అందులో ఉన్న ఫోన్ పే యాప్ ద్వారా రూ. 1.92 లక్షల నగదును కాజేశారు. కాగా.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.
- రూ. 1.92 లక్షల కాజేత
హైదరాబాద్: ఫోన్ చోరీ చేసి అందులో ఉన్న ఫోన్ పే(Phone Pay) యాప్‌ను ఉపయోగించి నగదు కొట్టేశాడు ఓ దొంగ. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్(Kanchanbagh Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కమల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలెపల్లికి చెందిన రాధాకృష్ణారావు(74)మాజీ సర్పంచ్. గత నెల 13న నాగోల్‌లో ఉంటున్న కుమారుడి ఇంటికొచ్చాడు. తిరిగి సాయంత్రం తన సొంతూరు పోలెపల్లికి వెళ్లేందుకు నాగోల్‌లో బస్సు ఎక్కి మిధాని బస్టాండ్ వద్ద దిగాడు.

ఆరాంఘర్‌కు వెళ్లే బస్సు ఎక్కి కొద్ది దూరం ప్రయాణించాక తన సెల్‌ఫోన్ పోయిందని గుర్తించాడు. పోలెపల్లికి వెళ్లి కొత్త సెల్, సిమ్ వేసి పరిశీలించారు. అప్పుడే తన కెనరా బ్యాంకు సేవింగ్ అకౌంట్(Canara Bank Savings Account) నుంచి రూ.1.92లక్షల నగదు బదిలీ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే చోరీపై మంగళవారం కంచన్‌బాగ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాప్ ద్వారా బదిలీ అయిన నగదు రూ.1.21లక్షలను ఫ్రీజ్ చేయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News