Share News

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

ABN , Publish Date - Mar 19 , 2025 | 10:35 AM

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లు.. ఓవైపు కన్నతల్లి ఆకస్మిక మృతి.. మరోపక్క కన్నీటి పర్యంతమై పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద సంఘటన రామాపురంలో జరిగింది.

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

  • కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

  • గ్రామస్తులను కంటతడి పెట్టించిన ఘటన

చెన్నై: సంతోషంగా పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థిని కన్నతల్లి హఠాత్తుగా మృతి చెందడంతో కన్నీరుమున్నీరైంది. వివరాలిలా.. పట్టుకోట సమీపం వెట్టువాంకోట రామాపురం ప్రాంతంలో తల్లి ఆకస్మిక మృతితో తల్లడిల్లిన ఓ బాలిక గుండెనిబ్బరం చేసుకుని ప్లస్‌-2 పరీక్షకు వెళ్ళిన సంఘటన ఆ ఊరివారందరికీ కంటతడిపెట్టించింది. రామాపురం(Ramapuram) వద్ద రాజేంద్రన్‌, కళ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరి మూడో కుమార్తె కావ్య ఊరనిపురం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌-2 చదువుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: Kannada Actress: రన్యానే సూత్రధారి!


ప్రస్తుతం ఆ బాలిక ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షలు రాస్తోంది. ప్రతి రోజూ తల్లి ఆశీర్వాదం తీసుకుని బొట్టు పెట్టుకుని కావ్య పరీక్ష రాసేందుకు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆ బాలిక తల్లి గుండెపోటుతో మృతిచెందింది. తల్లి ఆకస్మిక మృతితో ఆ కుటుంబం అతలాకుతలమైంది. తల్లి మృతిని తట్టుకోలేకపోయిన ఆ చిన్నారిని బంధువులు, స్థానికులకు ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ‘చదువే నిన్ను కాపాడుతుంది.


nani1.2.jpg

ప్లస్‌-2 పరీక్షలు బాగా రాసి మంచి పేరుతెచ్చుకో’ అంటూ చెప్పిన తల్లిమాటలు గుర్తుకు తెచ్చుకున్న కావ్య వెంటనే పరీక్షకు సన్నద్ధమైంది. తల్లి బౌతిక కాయం వద్ద నిల్చుని, ‘అమ్మా పరీక్ష రాయడానికి వెళుతున్నా నన్నాశీర్వదించి విభూతి పెట్టవా?’ అంటూ కావ్య బోరున విలపించగానే బంధువులంతా కంటతడిపెట్టుకున్నారు. కాసేపయ్యాక ఓ బంధువుతో కలిసి బైకు మీద కావ్య పరీక్ష రాయడానికి వెళ్లింది.. ఈ విషయమై కళ బంధువులు మాట్లాడుతూ కావ్య సోదరికి 15 రోజుల క్రితమే వివాహం అయిందని,


ఆమె అన్నయ్య కాలేజీలో చదువుతున్నాడని, భర్త మానసిక రోగి అయినప్పటికీ కళ కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చిందని తెలిపారు. కావ్య అంటే ఆమెకు అపారమైన ప్రేమ అని, బాగా చదివి ఉన్నత స్థితికి రావాలని పదే పదే చెబుతుండేదని, ఈ పరిస్థితుల్లో తల్లి మృతి వల్ల కలిగిన శోకాన్ని భరిస్తూ కావ్య తల్లిమాట ప్రకారం పరీక్ష రాయడానికి వెళ్లటం తమకు మరింత దుఃఖాన్ని కలిగించిందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2025 | 10:35 AM