Share News

Hyderabad: రాజస్థాన్‌ టు హైదరాబాద్‌.. నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Jul 30 , 2025 | 08:31 AM

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు ఓపీఎం డ్రగ్‌ (నల్లమందు)ను సరఫరా చేసి నగరంలో గుట్టుగా విక్రయిస్తున్న నిందితుడిని ఎక్సైజ్‌ డీటీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 755 గ్రాముల ఓపీఎం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: రాజస్థాన్‌ టు హైదరాబాద్‌.. నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు

- 755 గ్రాముల నల్లమందు సీజ్‌

హైదరాబాద్‌ సిటీ: రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు ఓపీఎం డ్రగ్‌ (నల్లమందు)ను సరఫరా చేసి నగరంలో గుట్టుగా విక్రయిస్తున్న నిందితుడిని ఎక్సైజ్‌ డీటీఎఫ్‌ పోలీసులు(Excise DTF Police) పట్టుకున్నారు. అతని నుంచి 755 గ్రాముల ఓపీఎం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌ అత్తాపూర్‌ పాండురంగనగర్‌(Attapur Panduranganagar)లోని ఓ దుకాణంలో నల్లమందు విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.


city5.jfif

తనిఖీలు చేయగా.. రాజస్థాన్‌(Rajasthan)కు చెందిన దినేష్‌ ఓపీఎం డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. 50గ్రాముల ఓపీఎంను రూ.20వేల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 755 గ్రాముల ఓపీఎం విలువ రూ. 3.20లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్‌ టీమ్‌ను ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కృష్ణప్రియ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 08:31 AM