Hyderabad: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:26 AM
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువతి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఇది. తనతోటి వారందరికీ వివాహాలు జరగడం, తనకు వయసు పెరిగిపోతున్నా వివాహం కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- యువతి ఆత్మహత్య
హైదరాబాద్: పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనస్థాపానికి గురైన ప్రైవేటు ఉద్యోగిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట మారుతినగర్(Champapet Maruti Nagar)కు చెందిన సుచిత్ర(33) ప్రైవేటు ఉద్యోగి. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటుంది. కొన్ని రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా అవి కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఈ వార్తను కూడా చదవండి: Nagababu: టూరిస్టులపై దాడి హేయమైన చర్య..
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పై కప్పు గోడకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య పర్యవేక్షకురాలుగా పనిచేస్తున్న తల్లి అనమ్మ విధులు ముగించుకొని రాత్రి 9.30గంటల సమయంలో ఇంటికి రాగా తలుపులు వేసి ఉన్నాయి. చాలాసార్లు తలుపుతట్టినా తెరవకపోవడంతో స్ధానికుల సహాయంతో తలుపులను తెరవగా కూతురు ఉరేసుకొని ఉంది.
విషయాన్ని పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో దొరికిన సుసైడ్‌నోట్‌లో తన మృతికి ఎవరూ కారణం కాదని, తను జీవితంలో అలిసిపోయాను అని అందరూ నన్ను క్షమించాలని రాసింది. ఈ మేరకు తల్లి అనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
ఫినాయిల్, సబ్బుల పైసలు నొక్కేశారు
Read Latest Telangana News and National News