Hyderabad: గంజాయి అమ్ముతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్
ABN , Publish Date - Jul 04 , 2025 | 09:42 AM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో వస్తున్న జీతం సరిపోలేదంటూ స్నేహితుడి సహకారంతో గంజాయి అమ్మకాలకు దిగిన ఓ టెకీని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ సిటీ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం(Software job)తో వస్తున్న జీతం సరిపోలేదంటూ స్నేహితుడి సహకారంతో గంజాయి అమ్మకాలకు దిగిన ఓ టెకీని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్లేపల్లి పరిధిలో నివాసం ఉంటున్న మహ్మద్ నదీమ్(26) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు అర్జున్‌రెడ్డితో కలిసి గంజాయి అమ్మకాలు చేస్తున్నాడు.
అర్జున్‌రెడ్డి తీసుకువచ్చే గంజాయిని ఓ యాప్ ద్వారా బుక్ చేసుకొని నదీమ్ నారాయణగూడ ప్రాంతంలో అమ్మకాలు చేస్తుండగా.. సీఐ నాగరాజు నేతృత్వంలో ఎస్‌టీఎఫ్ బృందం పట్టుకుంది. నిందితుడి నుంచి 500 గ్రాముల గంజాయి, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోనిందితుడు అర్టున్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశామని, అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
మరో కేసులో ఒకరు
కూకట్‌పల్లి 4వ ఫేజ్ వద్ద గంజాయి అమ్మకాలు చేస్తున్న రమావత్ లోక్‌నాథ్ నాయక్(29) అనే డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 2.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న నిందితుడు అనంతపూర్ జిల్లా పీకే తండా నల్లమడ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు నిమిత్తం నిందితుడిని బాలానగర్ స్టేషన్‌లో అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News