Hyderabad: కొత్త బుక్స్ కొని.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లేందుకు తయారై..
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:01 AM
ఆ తల్లికి ఎలా ప్రాణం ఒప్పిందో తెలియదు గాని నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి కన్న తల్లే తన బిడ్డలను కడతేర్చిన విషాద సంఘటన ఇది. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోన్న తల్లే తన ఇద్దరు పిల్లలను చంపిన విషయాన్ని గుర్తించారు.

- అనూహ్యంగా తల్లి చేతిలో దారుణహత్యకు గురైన పిల్లలు
హైదరాబాద్: కన్నబిడ్డలు ఆశీష్, హర్షిత్(Ashish, Harshit)లను వేట కొడవలితో నరికి చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకున్న తేజస్విని తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తమకు ఎవ్వరిపైనా అనుమానాల్లేవని పోలీసుల ఎదుట స్పష్టం చేశారు. ఘోరం తాలూకు సమాచారం చెవిన పడటంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి తేజస్విని తల్లిదండ్రులు.. గువ్వల వెంకట్‌రెడ్డి, సుగుణ హైదరాబాద్‌లోని గాజులరామారానికి వచ్చారు. వాస్తవానికి.. శుక్రవారం హర్షిత్ పుట్టినరోజు. ఈ వేడుక కోసం తేజస్విని తల్లిదండ్రులు హైదరాబాద్ రావాలనుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: RTC buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు పది నిమిషాలకో బస్సు
పైగా పిల్లలకు సెలవులు రావడంతో తేజస్వినిని, ఇద్దరు మనుమళ్లను శనివారం సత్తుపల్లికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ విషయమ్మీద గురు వారం మధ్యాహ్నం సుగుణ తన కుమార్తెకు ఫోన్ చేసి మాట్లాడింది. పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆడుకుంటూ కిందపడతారు జాగ్రత్త అని సూచించింది. అటు పిల్లలు కూడా అమ్మమ్మ, తాతయ్య వచ్చి.. తమను తీసుకెళతారని ఉత్సాహంగా బ్యాగులో బట్టలు సర్దుకున్నారు. అంతకుముందు రోజు పై తరగతుల కోసం నాన్న తెచ్చిన కొత్త పుస్తకాలను దాచుకున్నారు.
అయితే.. తాను ఫోన్ చేసిన గంటలోపే పిల్లలు ఆశీష్, హర్షిత్‌లను తేజస్విని దారుణంగా హత్యచేసి.. తాము ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె తల్లిదండ్రులు వెంకట్, సుగుణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆశీష్, హర్షిత్‌తో నిత్యం ఆడుకునే ఆ అపార్ట్‌మెంట్‌లోని పిల్లలూ ఏడ్చారు. కాగా తేజస్వినికి వెంకటేశ్వర్‌రెడ్డితో రెండో వివాహం! ఆమెకు గతంలోనే పెళ్లయినా ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. 2016లో వెంకటేశ్వర్ రెడ్డిని చేసుకుంది. కరోనా తర్వాత తేజస్విని మానసిక పరిస్థితిలో తీవ్ర మార్పులొచ్చాయని.. ఆరోగ్యం బాగాలేదు చనిపోతానని తరచూ తల్లిదండ్రులతో చెబుతుండేది.
రాత్రుళ్లు నిద్రలోంచి లేచి అరవడంతో వైద్యం చేయిస్తున్నారు. దీనికితోడు నేత్ర సంబంధ సమస్యలతోనూ తేజస్విని బాధపడుతోంది. ఇక పిల్లలిద్దరికీ ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో వారికి తేజస్విని నాలుగు గంటలకోసారి చుక్కల మందు వేసేది. తాను, పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా భర్త పట్టించుకోవడం లేదని తేజస్విని ఆవేదనచెందేది. కాగా ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News